బిఆర్ఎస్ లో చేరిన మొవ్వ సత్యనారాయణ
ఎమ్మెల్యే గాంధీ పాచికలు సఫలీకృతం
మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు అరికెపూడి గాంధీ వ్యూహం
హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అంతేకాకుండా పార్టీలోని నేతలు జంపు జిలానిలుగా మారిపోతున్నారు ఇందులో భాగంగానే బిజెపి పార్టీకి చెందిన మొవ్వ సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
శేరిలింగంపల్లి నియోజక వర్గంలో బిజెపి కీలక నేతగా కొనసాగుతున్న మొవ్వ సత్యనారాయణ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు ఇవ్వకుండా బిజెపి అధిష్టానం శేరిలింగంపల్లి నియోజక వర్గ స్థానాన్ని రవికుమార్ యాదవ్ కు కేటాయించడంతో, అప్పటినుండి పార్టీ అధిష్టానం తీరుపై మువ్వా సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పటివరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేశారు, కానీ రాజకీయం రోజు రోజుకు పరిణామాలు తారుమారు అవుతా ఉన్నాయి.
మువ్వ సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో, బిఆర్ఎస్ పార్టీకి మరింత బలోపేతం అవుతుంది. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు కావడంతో , ఇరువర్గాలు సానుకూల ఉన్న నేతలు ఆ సామాజిక వర్గ సంఘ పెద్దలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.