వినరా వినరా
ఈ చోద్యం గురించి విని
నవ్వరా..నవ్విపోరా!
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ
అదెంత సంబరం!
ఒక ప్రజాప్రతినిధి
జీవిత కథను
సినిమాగా తీస్తే కాస్ట్యూమ్స్
ఖర్చు ఉండదట..
ఇది నిర్మాత సంబరం!
ఇంట్లో ఇల్లాలు..
ఫోన్లో ప్రియురాలు..
అక్కడ పోలీసు యూనిఫారం..
ప్రజల్లో నాయకుడి ముసుగు..
ఫోన్లో మాత్రం దిగంబరం..
ఇలా ఉండడం
ఆయనకెంత సంబరం!
శాపం దివ్యాంగం…
మరి చూపిస్తే ఇలా అంగం
మద్దతు ఇస్తూ
ఎంత పెద్ద యంత్రాంగం..
వెనక ఎంతమంది పెద్దల మంత్రాంగం..
పైగా ఇదంతా విపక్షాల కుట్ర
అంటూ భుజాలు చరచుకునే
వికృత సంబరం..!
నీ వీడియో..నీ ఆడియో..
నీ దగ్గరుంటే సంబరం
జనాలకి చేరితే జుగుప్స
గుప్త నిధి..గుప్త అవయవం..
బయటపడితే గుప్తరోగం..
అయినా కొనసాగుతున్న
పదవీయోగం..
విజయవంతమైన
పైరవీ యాగం…
ప్రజాస్వామ్య దేశంలో
దుర్మార్గమే పెద్ద సంబరం!
– ఈఎస్కే