రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన పథకంపై రఘురామ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అది విద్య దీవెన కాదని… విద్యా వంచన పథకం అంటూ విమర్శలు గుప్పించారు.విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని నాలుగు విడతలుగా అందజేయడం ఏమిటని ప్రశ్నించారు. రెండు విడతలుగా అందజేసే వచ్చే నష్టం ఏమిటంటూ నిలదీశారు. విద్యా దీవెన పథకం లో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలు జమైన మొత్తాన్ని కాలేజీ యాజమాన్యానికి చెల్లించాలని, లేకపోతే మిగతా మొత్తాన్ని నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమ చేస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును తల్లుల ఖాతాలో జమ చేయ మని ఎవరు అడిగారో చెప్పాలని రఘు రామ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ గతంలో సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయనున్నట్లు, తామే ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా జగన్ రెడ్డి సర్కార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభలకు జనాలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సభలు జనం లేక వెలవెలబోతున్నాయి అన్నారు.. తిరుపతి సభ కోసం పార్టీ నేతలకు టార్గెట్లు విధించి, మహిళలను విద్యార్థులను తరలిస్తున్నారు. గత ప్రభుత్వం బాగానే పని చేసిన, అప్పుడు నేను చెప్పిన మాటలు విని జనాలు వచ్చారని రఘురామ వివరించారు.