– రెండున్నరేళ్లుగా సీఎం జగన్‌రెడ్డి కోర్టుకే రాలేదు
-ఎంపీ రఘురామకృష్ణరాజు
ఢిల్లీలో తాను ఉంటే పారిపోయినట్లా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.తన ఫొటో వేస్తేనే సాక్షి మీడియాకు టీఆర్పీ వస్తుందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉక్కిరిబిక్కిరవుతున్న రఘురామ అంటూ సాక్షిలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా సీఎం జగన్‌రెడ్డి కోర్టుకే రాలేదని విమర్శించారు. ప్రివిలేజ్ కమిటీ ఎంపీ బండి సంజయ్ విషయంలో ఒక న్యాయం, తన విషయంలో ఒక న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంతో పోరాటంలో అంతిమ విజయం ఉద్యోగులదేనని చెప్పారు. ఉద్యోగులను బుజ్జగించడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నమ్మించడానికి నాని, సర్దిచెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సర్దుకోమనడానికి సీఎస్ సమీర్‌శర్మ, బెదిరించడానికి బొత్స సత్యనారాయణలతో కమిటీ వేశారని రఘురామకృష్ణరాజు ఎద్దేవాచేశారు. పరిమితికి మించి అప్పులు చేస్తూ ఏపీని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. తనపై అనర్హత వేటు వేయించలేమని మీరు చేతులెత్తేస్తే.. తాను తక్షణమే రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. ఫిబ్రవరి 5 వరకు సమయమిస్తా డిస్‌క్వాలిఫై చేయాలని సవాల్ చేశానని తెలిపారు. ఉక్కిరిబిక్కిరవుతున్న రఘురామ అంటూ సాక్షిలో దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.