వెల్లంపల్లీ.. ఎన్ని పార్టీలు మారావ్?

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కౌంటర్

విజయవాడ: రాజకీయ పార్టీలలో పని చేస్తున్నప్పుడు గతం మర్చిపోయారా… ఇదేనా మాట్లాడేతీరు.. ఆత్మకూరు ఘటనలో ఎవరి తప్పు అనేది ఎస్పీ చెప్పింది మర్చిపోయారా? రామతీర్థం లో రాముడు తల చిరఛేధనం చేస్తే ఎందుకు బాధ్యులను అరెస్ట్ చేయలేదు.మంత్రిగా ఉండడానికి వెల్లంపల్లి కి అర్హత లేదు. బీజేపీ లో ఎమ్మెల్యే గా మ్యాండెట్ తీసుకున్నావు. దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా నిజాలు మాట్లాడాలి.వెల్లంపల్లి స్థాయికి మించి నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం కాదు. బీజేపీపై కామెంట్ చేసేటప్పుడు వెల్లంపల్లి హోం వర్క్ చేయాలి ,మంత్రి నోటి దురుసు తగ్గించుకోవాలి.

Leave a Reply