రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్
కర్నూలు : ఆత్మకూరు ఘటనపై ప్రభుత్వం స్పందన లేదని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డిని హత్య చేయడానికి వచ్చిన వారిని వదిలి ఆయన పైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. గుడివాడలో కేసినో నడిపినా పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేకపోయిందన్నారు. జగన్‌కి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు. దేశంలో ఎక్కడ ప్రభుత్వ వేతనాలు తగ్గించిన సందర్భాలు లేవన్నారు. ఏపీలో ఏమి చేసినా చెల్లుతుందని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రమేష్ పేర్కొన్నారు.