-రైతుల ఖాతాల్లో రూ 3758 కోట్లు జమ
-కర్నూలులో ప్రపంచంలోనే మెట్టమెదటి ఐఆర్ఈపి ప్రాజక్టు
-ప్రపంచ కప్ లో సత్తా చాటిన మహిళా షూటర్లకు అభినందనలు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
చంద్రబాబు మూడు రోజుల కుప్పం టూర్ తుస్సుమందని, పర్యటన ఆద్యంతం బాబు ఉపన్యాసాలే తప్ప సలహాలిచ్చే అవకాశం ప్రజలకు ఇవ్వకపోవడం, ఏదైనా చెప్పబోతే కసురుకోవడం, ఎక్కడ చూసినా రోప్ పార్టీ పోలీసులు, సొంత సెక్యూరిటీ మనుషులే ఎక్కువగా కనిపించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు జనాలను బాది వచ్చాడని ఏద్దేవా చేసారు.
గాలికి చెట్లు కొమ్మలు విరిగినా అది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని నిస్సిగ్గుగా ప్రచారం చేసే స్థాయికి ఎల్లో మీడియా, పచ్చ మాఫియా బరితెగించాయని, బాబు అయితే అటువంటి సందర్భాల్లో ఏకంగా ‘రాడార్’ లో చూసి కొమ్మలు తొలగించమని ఆదేశించే వాడని చెప్పడమే ఇక మిగిలిందని ఎద్దేవా చేసారు.
అంగారక గ్రహానికి మనుషులను పంపాలని ప్రపంచ కుబేరుడు ఇలన్ మస్క్ కు ఐడియా ఇచ్చి స్పేస్ ఎక్స్ రాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంట! ఆ రోజుల్లో దావోస్ లో బాబును కలిసేందుకు బిల్ గేట్స్ రోజంతా వేచియున్నాడని అప్పట్లో ఎల్లో వ్రాసుకొచ్చింది కూడా,అందుకే రాత్రంతా అమెరికా కాల్స్ కోసం వెయిట్ చేస్తుంటాడట పాపం బాబు అంటూ ఎద్దేవా చేసారు.
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించిందని,సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని తెలిపారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఏర్పాటువుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ నేడు (మంగళవారం) శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. 5,410 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే ఈ పవర్ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అవ్వడం ఈ ప్రాజక్టు ప్రత్యేకతని అన్నారు.
ఐఎస్ఎస్ఎఫ్ (అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) జూనియర్ ప్రపంచ కప్ పోటీలలో ఫిస్టల్ షూటింగ్ విభాగంలో సత్తా చాటిన మహిళా పిస్టల్ షూటర్లు సంగ్వాన్, మను భాకర్, నమ్య కపూర్ లను అభినందించారు. భారతదేశ సత్తాను చాటి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేయడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.