Suryaa.co.in

Telangana

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజు వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ ముదిరాజ్ మహాసభ మరియు ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని ఇంజనీర్స్ భవన్ లో నిర్వహించిన ముదిరాజు వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డా. బండా ప్రకాష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ…. సమాజ శ్రేయస్సు కోసం, ముదిరాజ్ జాతి కోసం, మన ప్రగతి ఎక్కడ ఉంది, మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా మన స్థితిగతులు ఏంటి, మన పరిస్థితి ఏంటి ,ఎక్కడ ఉన్నాం ,ఎట్లా ఉన్నాము, ఏ రకంగా ఉన్నాము అనేది సమీక్షించుకోవాలని కోరారు. మొట్టమొదటి సారిగా ముదిరాజ్ డాక్టర్స్ ఫోరమ్ 2019 మార్చి మూడో వారంలో ప్రారంభించడం జరిగింది. అనేక మందిని అక్కున చేర్చుకుని వారికి అండగా ఉండి సేవ చేసేది వైద్య వృత్తి. సీనియర్ డాక్టర్లు చదువుకునే పిల్లలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరారు.

డాక్టర్ల జీవితాలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కోరుకుంటుందని అన్నారు. రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరారు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర ను త్రవ్వే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కేవల్ కిషన్, బండి సాయన్న, కృష్ణస్వామి, పోలీస్ కిష్టయ్య, సూరటి అబ్బయ్య లాంటి ముదిరాజ్ మేధావుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, తెలంగాణ ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా. రమణ,ఉపాధ్యక్షులు డా. అశోక్ మరియు డా.రవిప్రసాధ్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డా. ప్రతిభ, డా.జగన్మోహన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లెబోయిన అశోక్ మరియు గుండ్లపల్లి శ్రీను తెలంగాణ ముదిరాజ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ దినేష్ కుమార్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, రాష్ట్ర కార్యనిర్మాణ కార్యదర్శి దమ్మి గారి కనకయ్య,కోశాధికారి బొక్క శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అంబర్ పేట సతీష్, మర్రి ప్రభాకర్, రంజిత్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE