Suryaa.co.in

Entertainment

ఆ స్వరం..అబ్బురం..!

ముక్కుతో పాడతాడనే ఏమో ముఖేష్ అయ్యాడని
చిన్నప్పుడు అనుకుంటే..
సైగలే అచ్చెరువొందేలా
అచ్చంగా ఆయనలాగే
పాడేసాడు..
అంతలో వరస మార్చి
పాడితే ఆ ముఖేష్ స్వరమే
రాజ్ కపూర్..దిలీప్ కుమార్
మనోజ్ కుమార్..
ఇంకెందరికో అయింది
సర్వస్వం..
ఒక్కోరిదీ ఒక్కో రకం అభినయం..
అందరికీ తగ్గట్టుగా ముఖేష్
బహుస్వరాభినయం…
చేస్తూ ఆయా హీరోలకు సమన్యాయం..!

సరే..రాజ్ కపూర్..ముఖేష్
ఒకరికోసం ఒకరు..
ఆ మోమున
గుండెలు పిండేసే వేదన..
ఈ గొంతులో
గుండెలు పగిలే రోదన..
పెహలా గంటా బచ్ పన్..
దూస్రీ జవానీ..
తీస్రీ బుఢా పే..
ఔర్ ఇస్కే బాద్..
మా నహీ..బాప్ నహీ..
బేటా నహీ..బేటీ నహీ
ఊపర్ హీ నహీ నీచే భీ
మూడున్నర గంటల సినిమా
మూడు ఎపిసోడ్లు..
మూడు విరామాలు..
జనాన్ని కపూర్ కూర్చోబెట్టడం
ముఖేష్ పాటల మంత్రమే..
జీనా యాహా మర్నా యహా
ఇస్కే సివా జానా కహా..
కపూర్ జోకరైనా..
భగ్నప్రేమికుడైనా
ముఖేష్ పాడితేనే
జనాలు ఖుష్ ఖుష్..!

ఏ కౌన్ హస్తా హై_
ఫూలోంసే చుప్ కర్..
శ్రోతలను ఊహాలోకాల్లోకి
తీసుకుపోయే మత్తు..
కభీ కభీ మెరె దిల్ మే
ఖయాల్ ఆతా హై…
ఇత్నీ సుందర్ కౌన్ గాసక్తా హై
ముఖేష్ జీ కే సివా
కభీభీ వారేవా..!

కయి బార్ యూహి దేఖా హై
అవార్డు తెచ్చిపెట్టిన రజనీగంధ..
సుస్వర సౌగంధ..
స్వర గాంధర్వ…
ఎక్ ప్యార్ క నగ్మా హై
మనోజ్ కుమార్ షోర్.. ముక్కుతో
ఆయన మాట
ముఖస్తా ముఖేష్ పాట..
ఆరోజుల్లో
అభిమానులకి కంఠస్తా..!

పదమూడు శతకాల
పాటల ప్రయాణం..
ఆ పాటల కోసమే
విదేశానికి పయనం..
పాడక మునుపే
గుండె ఆగింది…
పాడాలి..పాడాలని కొట్టుకుంటూ..
జానే కహా గయే వొదిన్..
కెహతే ధె తేరీ రాహ్ మే..
నజరొంకి హం భిచాయెంగే..
ఆయన వెళ్ళినా
పాట ఆగిపోలేదు
కచేరీ ఆగలేదు..
జనకుని పాటలను తనయునితో
కలిసి పాడి
రాగాల అశ్రువులతో వేదికను
తడిపేసారు లతాజీ..
ముఖేష్ భయ్యాకి
కన్నీటి నివాళి…
ముగిసి ఆ గానగంధర్వుని
పాటల వ్యాహ్యాళి…!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE