Suryaa.co.in

Andhra Pradesh Business News

టిటిడికి ముఖేష్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళం

తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ టీటీడీ కి కోటి యాభై లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీతో ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు సి భాస్కర్ రెడ్డితో పాటి ఇతర టీటీడీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE