ఆర్థిక శాఖ(వాణిజ్య పన్నులు) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా

– పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు
సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆర్థిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ మొదటి అంతస్తులో తన చాంబర్లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల (ఆహార శుద్ది) శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. మీనా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు వాణిజ్య పన్నులను పూర్తి స్థాయిలో సమర్థ వంతంగా వసూలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పన్ను ఎగవేత దారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జీఎస్టీకి సంభందించిన ఇబ్బందులను అధికమించేదుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని మీనా పేర్కొన్నారు.