Suryaa.co.in

Andhra Pradesh

హత్యలు, అత్యాచారాలు,ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా..?

-న్యాయవ్యవస్థను నరేంద్ర మోడీ ధ్వంసం చేస్తున్నారు
-రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదు?
-పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు
-దేశ అధ్యక్షురాలు ద్రౌపదిముర్మును డమ్మీ చేశారు
-జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు
-సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి : ఎన్నికల కోసమే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్. అందమైన బాషతో అందమైన అబద్థాలు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదు. ట్యాక్స్ వ్యవహారంలో కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేశారు. నేతి బీరకాయలో నెయ్యంత ఉందో బడ్జెట్ అదే విధంగా ఉంది. బడ్జెట్ లో అయోధ్య అంశాన్ని ఎందుకు లేవనెత్తారు?

బిజెపి నేతల వైఖరితో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దేశంలో మతకల్లోలాలను సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదు? పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు దేశ అధ్యక్షురాలు ద్రౌపదిముర్మును డమ్మీ చేశారు.రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బిజెపి నేతలు పాల్పడుతున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్ ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు.

న్యాయవ్యవస్థను నరేంద్ర మోడీ ధ్వంసం చేస్తున్నారు. దేశంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి అప్పగించేందుకు కేంద్రం సిద్థమైంది. 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే, జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? జగన్మోహన్ రెడ్డిని విమర్సిస్తే మాపై కులం అంటగట్టారు.

సొంత చెల్లెలు షర్మిళ విమర్శలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదు చంద్రబాబు వదిలిన బాణం షర్మిళ అని వైసిపి నేతలు చెప్పడం హాస్యాస్పదం. ఎపిలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో, జగన్ మోడీ జపం చేస్తున్నారు.

జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు,ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియాదారులు, కబ్జాకోరులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులా?ఎన్నికలు సమీపించడంతోనే కోతికత్తి కేసును పెండింగ్ లో పెట్టారు.

LEAVE A RESPONSE