Suryaa.co.in

Business News International National

‘ఎక్స్’ను అమ్మేసిన మస్క్

ప్ర‌పంచ‌కుబేరుడు, ఎక్స్ సీఈఓ ఎలాన్ మ‌స్క్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌)ను విక్రయించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘ఎక్స్‌’కు 600 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. మస్క్ ఏఐ స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’కు విక్రయించారు. మొత్తం 33 బిలియన్ డాలర్ల (రూ. 2.80 లక్షల కోట్లు)కు ఎక్స్‌ను అమ్మినట్లు, దీంతో ప్రస్తుతం ‘ఎక్స్ ఏఐ’ విలువను 80 బిలియన్ డాలర్లుగా మస్క్ పేర్కొన్నారు. అధునాత ఏఐ టెక్నాలజీని ‘ఎక్స్‌’కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE