Suryaa.co.in

Telangana

కేసీఆర్ అవినీతి, తానాసాహి పాలనను బొందపెడతాం

– బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు
– కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లా మారింది
– తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన నడ్డా
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఓరుగల్లు గడ్డ పై అడుగుపెట్టడం నా అదృష్టం గా భావిస్తున్నా. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా. 3వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” ముగింపు సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే… కేసీఆర్ అంధకారంలోకి నెట్టేసిన తెలంగాణలో వెలుగులు నింపాలనే. ప్రజా వ్యతిరేకimage-4 ప్రభుత్వం… ఈ కేసీఆర్ ప్రభుత్వం. నేను 2వ విడత పాదయాత్ర కు వచ్చినప్పుడు కూడా… ఆ సమయంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం. ప్రజలు బీజేపీ కి మద్దతు ఇవ్వడం ఖాయం.

అప్పట్లో నిజాం జన సభలు పెట్టుకోవద్దని చివరి ఫర్మానా జారీ చేశాడు… అదే ఆయనకు చివరిది అయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా సభలు పెట్టుకోవద్దని ఫర్మాణాలు జారీ చేస్తున్నాడు. కేసీఆర్ కు కూడాimage-2 ఇదే చివరి ఫార్మాణా అవుతుంది. తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా… కేసీఆర్ వాటిని ఖర్చు చేయలేదు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడు.

కేంద్రం ఇచ్చే నిధులతో… తన బొమ్మ పెట్టుకుని, తన స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంటున్నాడు.తెలంగాణ ను ఏర్పాటు చేయాలని కాకినాడ లో మొదట తీర్మానం చేసిందే బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుimage-3 ఏటీఎం లా మారింది.రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ను 1.40వేల కోట్లకు పెంచుకుని, డబ్బు దండుకున్నాడు. మజ్లిస్ కు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ను అధికారికంగా జరుపుతాం.

బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు.దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించాం.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం. కేసీఆర్ అవినీతి, తానాసాహి పాలనను బొందపెడతాం.

LEAVE A RESPONSE