మోడీపై నాగబాబు వ్యాఖ్యలు అర్థరహితం

– బిజెపి నేత రఘు ఖండన

జనసేన నాయకుడు, జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ స్వయానా సోదరుడు నాగబాబు భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహావిష్కరణ సభపై చేసిన ట్వీట్ చాలా సిగ్గుచేటుగా ఉంది..”అని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ సమన్వయకర్త, బిజెపి నాయకుడు పురిఘళ్ళ రఘురాం( ఢిల్లీ రఘు)పేర్కొన్నారు.భీమవరం లాంటి పట్టణానికి ప్రధాని స్వయంగా వచ్చి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు , తెలుగు స్వాతంత్ర సమరయోధులను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా అద్భుతమైన బహిరంగసభ జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని అభినందించకుండా వెటకారపు వ్యాఖ్యానాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు . ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి హాజరైన ఈ సభ “అందరూ బాగా నటించారు… తన సోదరుడు చిరంజీవి తప్ప ”అంటూ చేసిన ట్వీట్ పై ప్రధానమంత్రి మోదీని, బిజెపి నేతలలను అవమానించడం కాదా? అన్నారు..ప్రధానినే కాదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, రాష్ట్ర అధ్య క్షుడు సోము వీర్రాజును,బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధేశ్వరిలను కూడా అవమానించడమే కదా..?అని ప్రశ్నించారు. భీమవరంలో ఎంతో అద్భుతంగా జరిగిన ఈ బహిరంగ సభను అందరూ అభినందిస్తూ ఉంటే నాగబాబు కూడా సంతోషం వ్యక్తం చేయాలి..లేకపోతే మిన్న కుండాలే తప్ప … వెటకారపు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు…
ఇటువంటి అభ్యoతరకర రాజకీయ వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.. ప్రధాని, నాయకులను అవమానించడమేనని గ్రహించాలన్నారు.. “నాగబాబు వ్యాఖ్యలపై నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..” అని రఘురామ్  పేర్కోన్నారు.