Suryaa.co.in

Telangana

నాగర్‌కర్నూల్‌ ఎంపీ భారాస అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

– హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు భారాస మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ – డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ – అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం – నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ – ఆత్రం సక్కును ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు 13 స్థానాలకు భారాస అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

LEAVE A RESPONSE