Suryaa.co.in

Andhra Pradesh

తాను చంద్రబాబుని అన్నమాటలు గుర్తులేవా?

– గంజాయి రవాణా, అమ్మకాల్లో మునిగితేలుతున్న తనపార్టీ వారి గురించి ఎందుకు మాట్లాడడు?
– డీజీపీ తన ప్రభుభక్తిని పక్కనపెట్టి, మత్తులో జోగుతున్న యువతను కాపాడే ప్రయత్నంచేస్తే మంచిది.
– మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
టీడీపీనేత పట్టాభి ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి, వైసీపీనేతలు, కార్యకర్తలకు గతంలో అధికారపార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడినమాటలు, మంత్రులు వాడిన బూతుల్లో అభ్యంతరాలు ఏవీ కనిపించడంలేదా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నక్కాఆనంద్ బాబు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టాభిమాటలను తప్పుపట్టే ముందు, అసలు ఈ రాష్ట్రంలో తొలుత అభ్యంతరకర, జుగుప్సాకరమైనభాషను ఎవరుతీసుకొచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడిని పట్టుకొని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు ఏమన్నారో వారుమర్చిపోయినా ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు తనుతోట్టడమే కాకుండా, తనతోటివారి బూతులను సమర్థించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు తగుదునమ్మా అంటూ నీతివాక్యాలు వల్లించడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిని దూషించినప్పుడే, ఆయనకు, ఆయనపార్టీవారికి గట్టిగా బుద్ధిచెప్పిఉండాల్సిందని ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు. రెవెన్యూమంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతులను లంజాకొడుకులంటే, స్పీకర్ గా ఉన్న తమ్మినేని, మంత్రులు కొడాలినానీ, అనిల్ బూతుల్లో పోటీపడుతుంటే, అవేవీ డీజీపీకి, ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని మాజీమంత్రి ప్రశ్నించారు.
బోషడీకే అనేపదానికి అర్థాలువెతికి దాన్నిపటుకొని అసలువ్యవహారాన్ని దారిమళ్లించడానికి చూస్తోందన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగినదాడికి మూలకారణమేంటో, రాష్ట్రంలో ఏం జరుగుతోంటే ప్రతిపక్షనేతలు ప్రశ్నించారో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు దశలవారీగా మద్యపాననిషేధం అమలుచేస్తానన్న పెద్దమనిషి, ఇప్పుడు దశల వారీగా మద్యంఅమ్మకాలు పెంచుకుంటూపోవడం తప్పుకాదా అని ఆనంద్ బాబు నిలదీశారు. మద్యంఅమ్మకాలపై వేలకోట్లు దండుకోవడమేకాకుండా, గంజాయిసాగు, రవాణా, ఇతరమాదకద్ర వ్యాలను అమ్ముకుంటూ లక్షలకోట్లు పోగేసుకుంటుంటే, టీడీపీ ప్రశ్నించకూడదా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లు మాదక ద్రవ్యాలు సరఫరాచేసి, ఉగ్రవాదానికి అవసరమైన నిధులు సమ కూర్చుకుంటుంటే, ఏపీపాలకులు ఆంధ్రాతాలిబన్లలామారి వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆనంద్ బాబు ఆగ్రహంవ్యక్తం చేశారు.
ప్రజలధనాన్ని దోపిడీచేస్తున్న పాలకులు, వారివైఫల్యాల నుప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై తప్పుడుకేసులుపెట్టి, జైళ్లకు పంపా లనిచూస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రశ్నించామని, టీడీపీ కార్యాల యంపై దాడిచేయించడం, పనికిమాలిన వెధవల్ని పదిమందిని పోగేసి, వారికి మందుపోయించి, దాడులుచేయిస్తే సరిపోతుందా అని మాజీమంత్రి ప్రశ్నించారు. మత్తునిషాలో ఎవడేంచేస్తున్నాడో తెలియకుండా సదరుమూకలు ప్రవర్తించారని, ముఖ్యమంత్రి డైరె క్షన్ లోనే టీడీపీపై దాడిజరిగిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యాలయాలపై జరిగినదాడులన్నీ ముఖ్యమంత్రి, డీజీపీల పర్య వేక్షణలో వారిమార్గదర్శకాలప్రకారం జరిగినవేనని టీడీపీసీనియర్ నేత తేల్చిచెప్పారు. పట్టాభిని బలిపశువుని చేస్తారంటున్న రామ చంద్రయ్యను నాయకుడిని చేసింది ఎవరో ఆయనే చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడగంజాయి పట్టుబడినా మూలాలుఏపీలోఉంటున్నా యని, దానిపై సమాధానంచెప్పకుండా ముఖ్యమంత్రి పదాలకు అర్థాలు వెతుక్కుంటున్నాడన్నారు.
తెలంగాణ పోలీసులు ఏపీలో గంజాయిస్మగ్లర్లపై దాడిచేసేవరకు ఇక్కడున్న ముఖ్యమంత్రి, పోలీసులు, డీజీపీ ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తే అది ఈ చేతగానివాళ్ల కు తప్పులా కనిపించిందన్నారు. ప్రశ్నించడమే వారిదృష్టిలో తప్పయితే, నిత్యం టీడీపీ తరుపున ప్రశ్నిస్తూనేఉంటామన్నారు. ముఖ్యమంత్రి నిర్దేశకత్వంలో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న పోలీస్ విభాగంలోని వారుకూడా టీడీపీకార్యాలయంపై జరిగినదాడిలో పాల్గొన్నారని, ఎవరి ధైర్యంతో, ఎవరి అండతో వారు ఆపనిచేశారో కూడా తేలుస్తామన్నారు. దాడికి వచ్చినవ్యక్తిని పట్టుకొని తమ పార్టీవారు పోలీసులకు అప్పగిస్తే, లోకేశ్ సహా, ఇతరనేతలపై హత్యాయత్నం, ఎస్సీఎస్టీ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి కావాలనే నిర్వీర్యంచేస్తున్నాడని, తాను, తనప్రభుత్వంచేస్తున్న దురాగతాలనుంచి ప్రజలదృష్టి మ ళ్లించడానికే ముఖ్యమంత్రి, ప్రతిపక్షాన్ని లక్ష్యంగాచేసుకుంటున్నా డని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తున్న ప్రతిదానికీ భవిష్యత్ లో ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంద న్నారు. ఈ ముఖ్యమంత్రికి దమ్ముంటే, గంజాయిసాగు, రవాణాలో ఉన్న వైసీపీనేతలను గుర్తించి శిక్షించాలని ఆనంద్ బాబు డిమాం డ్ చేశారు. డీజీపీ కూడా తనప్రభుభక్తిని కాస్తపక్కనపెట్టి, మత్తులో జోగుతున్న యువతనుకాపాడేప్రయత్నాలు చేస్తే, ప్రజలుకూడా సంతోషిస్తారన్నారు.

LEAVE A RESPONSE