దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలి

-ఎక్కడ మాదకద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా ఏపీ పేరే ఎందుకు వినిపిస్తుందో సీఎం, డీజీపీ ఆలోచించాలి
– కేసులు, దాడులతో ప్రతిపక్షాలను అణచివేయడం దేశప్రధానులుగా ఉన్నవారివల్లే కాలేదు.
– టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్
పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్షంపై నిందారోపణలు చేశారు..తాము, తమపార్టీ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నించి, కొత్తభాష్యాలుచెప్పడానికి ప్రయత్నించిభంగపడ్డారని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బోషడీకే అనేపదానికి నేనో, ముఖ్యమంత్రో చెప్పిందే అర్థం కిందకు రాదు. బోషడీకే అనేది గుజరాత్ లోని ఒకగ్రామం పేరని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. అమాయకులైనవారిని బ్రిటీషు వారు బోషడీకే అని సంబోధించేవారని చెప్పుకుంటారు. మీరు బాగున్నారా.. అనేఅర్థం కూడావస్తుందని చెబుతున్నారు. ఈ పదాలు, వాటిఅర్థాలు కాసేపు పక్కనపెడితే, అసలు ఈ రగడ ఎక్కడ, ఎవరితో మొదలైందో అందరూ గమనించాలి. అంతర్జాతీయం మొదలుకొని, దేశీయంగా సాగుతున్న డ్రగ్స్ దందాలో ఆంధ్రప్రదేశ్ పేరుఎందుకునానుతోంది. పక్కరాష్ట్రాల పోలీస్ అధికారులుపదేపదే ఏపీపేరు ఎందుకు చెబుతున్నారు? అదే ఆందోళనను ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ ఇక్కడ వ్యక్తపరిస్తే, అదితప్పా?
గంజాయి, ఇతరమాదకద్రవ్యాల బారినపడకుండా, యువత నిర్వీర్యం కాకుండా కాపాడే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తనభుజస్కంధాలపై వేసుకోవడం తప్పా? పొరుగురాష్ట్రంలో ముఖ్యమంత్రి గంజాయిసాగు, రవాణా అమ్మకంపై కఠినచర్యలు తీసుకుంటుంటే, ఈ ముఖ్యమంత్రి డ్రగ్స్ పై మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలపై అక్రమకేసులు పెట్టి, జైళ్లకుపంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు.
వైసీపీప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను పెంచిపోషిస్తూ, దాన్ని అడ్డుకో వాలనిచూస్తున్న తెలుగుదేశాన్ని నిలువరించాలనుకోవడం మూ ర్ఖత్వమే అవుతుంది. డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తు న్న వ్యక్తి, టీడీపీ కార్యాలయంపైకి దాడికివచ్చి, తమనేతలకు పట్టుబడినప్పుడే, తెలుగుదేశంపార్టీ కార్యాలయంపై, సిబ్బందిపై దాడిఘటనలో ఎవరిప్రమేయముందో స్పష్టమైపోయింది. పార్టీ కార్యాలయంలో మొత్తం సీసీకెమెరాలుఉన్నాయి. దాడికిపాల్పడిన వారిలో దాదాపు 10మంది పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్నారనే సమాచారం మాకుంది.
జరిగిన దాడిఘటనపై ఈ పోలీస్ యంత్రాంగం టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్ పై పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తుంటే, పోలీసులకు భంగపాటు తప్పదనిపిస్తోంది. ఎప్పుడో రాత్రి8.30 ని.లకు లోకేశ్ కార్యాలయా నికివస్తే, సాయంత్రం 6.30నిలకు ఆయన, కార్యాలయంలో పట్టు బడిన వ్యక్తిపై దాడిచేశాడని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మా సిబ్బందికి పట్టుబడిన వ్యక్తి నక్సల్స్ యాంటీవిభాగంలో పనిచేసే వ్యక్తిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా అతను అదే అయితే కొంతమంది నక్సల్స్ ఫోటోలు అతనికిచూపించి గుర్తుపట్ట మంటాం…అప్పుడు తేలుతుంది అతని అసలు రంగేమిటో. ఈ కేసుకి సంబంధించిన మూలాలను తేల్చడంకోసం అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేయబోతోంది.
తాడేపల్లిలోని సెల్ టవర్ మొదలుకొని, విజయవాడసమీపంలోని సెల్ టవర్ పరిధిలోని కాల్ రికార్డ్స్ ను కూడా నమోదుచేయాలని డిమాండ్ చేస్తాం. పోలీస్ వ్యవస్థపై ఉన్న గౌరవమర్యాదలను ఇప్పుడున్న వారు మంటగలుపుతున్నారు. సామాన్యప్రజలు గర్వించేలా పనిచేసిన ఏపీ పోలీస్ వ్యవస్థ నేడు జాతీయ స్థాయిలోనే అట్టడుగుస్థాయికి దిగజారింది. అందుకుకారణమెవరో పోలీసులే ఆలోచించాలి. పోలీస్ అమరవీరులఆత్మలు క్షోభించేలా నేడురాష్ట్రం లోని పోలీస్ శాఖ ప్రవర్తిస్తోంది.
కేవలం రెండేళ్లలో ఇప్పుడున్న డీజీపీ కూడా సామాన్యుడిలానే మారిపోతారు. సమాజంలో పోలీస్ యూనిఫామ్ వేసుకున్నవారినిచూస్తే, ప్రజలంతా గర్వపడాలి. కానీ నేడు రాష్ట్రంలోని పోలీసుల విధినిర్వహణ చూస్తుంటే, ప్రజలు ఈసడించుకునేలా ఉంది. సామాన్యుడికి ఫేస్ఆఫ్ ది పోలీస్ అంటే డీజీపీకాదు..కిందిస్థాయిలో తనకు కనిపించే కానిస్టేబుల్. ఆ కాని స్టేబుళ్లుఎవరూ నేడు తప్పు చేయడం లేదు. ఎక్కడైనా ఒకరిద్దరు చే సినా, ఉద్యోగంకోసమో, అధికారులఒత్తిడి భరించలేకో చేస్తున్నారు. అసలు బాస్ ఆఫ్ దిపోలీస్ వ్యవహారశైలే ప్రజలకు ఆక్షేపణీయంగా ఉంది. పైస్థాయిలో ఉన్న అధికారుల ఆదేశాలతో కిందిస్థాయిలో ఉన్న సామాన్యపోలీసుల అంతర్మథనంతో నలిగిపోతున్నారు. రాష్ట్రంలోని పోలీసులు వారికుటుంబసభ్యులను అడిగితే, వారే సమాధానంచెబుతారు.. సమాజంలో మాదకద్రవ్యాలు, గంజాయిని విచ్చలవిడిగా వదిలేయాలో వద్దో. ఉద్యోగాలు లేక నిరాశానిస్పృహ ల్లో మునిగిపోతున్న యువతను, పాఠశాలల పిల్లలను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేయడం ఎంతవరకు సమంజసమో, పోలీ సు కుటుంబాల్లోని వారే సమాధానంచెబుతారు.
రాష్ట్రయువత పెడదారిపట్టి, మత్తుకు బానిసలై గంజాయిలో మునిగితేలుతూ, చివరకు బ్లేడ్ బ్యాచ్ లుగామారి, రాష్ట్రంలోని ఆడబిడ్డల మానప్రాణా లను హరిస్తుంటే, ప్రతిపక్షాన్ని చూస్తూఊరుకోమని పోలీస్ శాఖ చెప్పదలుచుకున్నదా? గంజాయి, ఇతరమాదకద్రవ్యాలను ని యంత్రించాల్సిన వారే, నిస్సిగ్గుగా వాటిని ప్రోత్సహించడం, అడ్డుకో వడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాన్ని భయపెట్టి, నిలువరించాలని చూడటం క్షమించరాని నేరం. టీడీపీని భయపెట్టడం, ఆపార్టీనేతల ను అడ్డుకోవడం ఈ పోలీస్ కాదుకదా.. ఆ దేవుడే దిగొచ్చినా చేయలేడు. టీడీపీ కార్యాలయంలో పట్టుబడిన వ్యక్తిపై దాడిచేశా మని పోలీస్ శాఖ తప్పుడుకేసులుపెట్టింది.. అతన్ని ఎంత గౌర వంగా టీడీపీనేతలు, కార్యకర్తలు సాగనంపారో కార్యాలయంలోని సీసీటీవీ పుటేజ్జే నిదర్శనం. అది న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టిన నాడు ఏపీ పోలీస్ శాఖ తలఎత్తుకోలేదు.
టీడీపీనేతల భాషను తప్పుపడుతున్నారు.. వారు మాట్లాడినదానిలో తప్పేముందో, ఏ సందర్భంలో మాట్లాడారో ముఖ్యమంత్రి ఆలోచించరా? స్వయంగా రాష్ట్ర కేబినెట్ లోని మంత్రులుఅన్నంపెట్టే రైతులను ఉద్దేశించి అనకూడని మాటలన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి తనతోటి సభ్యు లను ఎందుకు వారించలేదు? కడుపుకు అన్నంతినేవారెవరూ అన్నంపెట్టే వారిని అనరానిమాటలు అనరని సీఎం ఎందుకు గ్రహించడంలేదు? రైతులను, వారితల్లులను కేబినెట్ మంత్రులు దూషించడం ముఖ్యమంత్రికి బాధఅనిపించలేదా? ఎవరో ఏదో అన్నారనే మాటను పట్టుకొని , దాన్ని భూతద్దంలోచూపి, ఏదో చేయాలని ముఖ్యమంత్రి చూస్తే, దాన్ని సమాజం హర్షించదు. టీడీపీ కార్యాలయంపై జరిగినదాడిఘటన సహా, రాష్ట్రంలో చలామ ణీ అవుతున్న మాదకద్రవ్యాలు, గంజాయి వ్యవహారంపై ప్రభు త్వం తక్షణమే సీబీఐ విచారణకోరాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వం ధైర్యంగా ఆపనిచేస్తే, అసలు దోషులెవరో ప్రజలకు కూడా తెలుస్తుంది.
టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన వారిని స్వయంగా డీఎస్పీస్థాయి అధికారి ఎస్కార్ట్ చేయడాన్ని కూడా తాముగమనించాము. దాడికివచ్చినవారిని డీఎస్పీనే దగ్గ రుండి మరీ వాహానాల్లోకి ఎక్కించడంఏమిటి? సెల్ ఫోన్ టవర్ల పరిధిలోని ఫోన్ నంబర్లను డంప్ ఎనాలిసిస్ చేస్తే అసలు వాస్తవా లు బయటపడతాయి. అందుకే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తు న్నాం. తక్షణమే జరిగినఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని. తమసిబ్బందికి పట్టుబడిన వ్యక్తి కానిస్టేబుల్ అని, స్థానిక సీఐ పరిగెత్తుకుంటూ వచ్చి మాకు చెప్పేవరకు, మాకుదొరికినవ్యక్తి కానిస్టేబుల్ అని తెలియదు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చిల్లర పనులు మానేస్తే మంచిది. కానిస్టేబుల్ ను నిర్భంధించామని మాపై తప్పుడుకేసులు పెడితే, పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి ఒరిగే దేమీలేదు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాజ్యాధికారాన్ని సుస్థిరంచేసుకోవాలని ప్రయత్నించినవారంతా అభాసుపాలు అయ్యారు తప్ప, అనుకున్నదిసాధించలేదు.
రాష్ట్రంలో శాంతిభద్ర తలు లేవని అధికారపార్టీవారే అంగీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధికారపార్టీ వారుఎందుకుధర్నాలుచేస్తున్నారు? తెలుగు దేశంవారు పెట్టేవి తప్పుడుకేసులు అయితే, చేసేవాదనలు నిరాధారమైనవి అయితే వాటిని అధికారంలోఉన్నవారు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? కచ్చితంగా రాష్ట్రంలో సామాన్యుడిని ప్రశ్నిస్తే అతనే చెబుతాడు.. శాంతిభద్రతలు ఎంతగొప్పగా అమల వుతున్నాయో? ఒకప్పుడు శాంతిభద్రతల్లో ప్రైడ్ ఆఫ్ఇండియాగా నిలిచిన ఏపీ పోలీస్ వ్యవస్థ, నేడు లాస్ట్ ఆఫ్ ఇండియాగా ఉంది. తెలుగుదేశంపార్టీ డ్రగ్స్ పైచేస్తున్న పోరాటాన్ని దాడులతో ఆపలే రు. చరిత్రలో ఇలాంటి దాడులు అనేకం టీడీపీచూసింది. దేశప్రధా నిగా ఉన్నవారే చేయలేనిదాన్ని ఈ రాష్ట్రముఖ్యమంత్రి, డీజీపీ చేయాలని చూస్తున్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకివచ్చిన తరువాత ఈ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులున్నింటిపై సమగ్రమై న దర్యాప్తుజరిగి తీరుతుంది. అప్పుడు అసలు దోషులెవరో, వారి వెనకుండి వారిని నడిపించినవారెవరో తేలుతుంది.

Leave a Reply