Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి పథకానికి నీపేరు.. నీతండ్రి పేరేనా?

-పార్ట్ టైమ్ పాదయాత్ర చేసిన జగన్ రెడ్డికి, చంద్రబాబుసభలకు వస్తున్న జనం ప్రభంజనం ఎలా కనిపిస్తుంది?
– ప్రతి పథకానికి నీపేరు.. నీతండ్రి పేరేనా?
– సొంత పార్టీ దళితఎంపీ చనిపోతే, అతని కుటుంబాన్ని పరామర్శించని జగన్ రెడ్డి, కందుకూరు దుర్ఘటనపై దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నాడు?
• వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎమ్ బ్యాచ్, మంత్రులు మానవత్వాన్ని మర్చిపోయి ఆయనబాటలోనే రాక్షసానందం పొందుతున్నారు
• జగన్ రెడ్డికున్న ప్రచారపిచ్చి దేశంలో ఎవరికీలేదు. కోడిగుడ్లు, పిల్లల స్కూల్ బ్యాగులు, షూలపై కూడా తనబొమ్మలేసుకనే స్థితికి దిగజారాడు.
• భూసర్వే పేరుతో రైతుల పాస్ పుస్తకాలపై తనతండ్రి, తనఫోటోలు వేసుకునే దుస్థితికి వచ్చాడు
• మరణించిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి, వారికుటుంబసభ్యులకు ధైర్యంచెప్పిన మానవతావాది చంద్రబాబు.
• తనపార్టీవారు చనిపోతే, వారి కుటుంబసభ్యుల్ని తనవద్దకే పిలిపించి, మొసలికన్నీరు కార్చే కుసంస్కారి జగన్ రెడ్డి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

కందుకూరు విషాదంపై మానవత్వం ఉన్నవారెవరైనా చలిస్తారని, కాస్తోకూస్తో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తారని, కానీ జగన్ రెడ్డి, వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎమ్ బ్యాచ్, మంత్రులు మాత్రం సిగ్గులేకుండా దుష్ప్రచారంచేస్తూ, రాక్షసానందం పొందుతున్నారని మాజీమంత్రి ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

జగన్ రెడ్డి ఆదేశాలతోనే వైసీపీ పేటీఎంబ్యాచ్ కందుకూరు దుర్ఘటనపై విషప్రచారంచేస్తూ శునకానందం పొందుతోంది. “కందుకూరు విషాదఘటనపై మానవత్వం ఉన్న వారెవరైనా అయ్యోపాపం అని చింతిస్తారు. వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎమ్ బ్యాచ్ మాత్రం దుష్టప్రచారం చేస్తూ, వికృతానందం పొందుతున్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే కందుకూరు దుర్ఘటనపై విషప్రచారంచేస్తూ అధికారపార్టీ, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ శునకానందం పొందుతోంది. నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి మాటలు విన్నాక, ఆయన పైకి చెప్పుకోలేనంత తీవ్రమైన నిరాశా, నిస్పృహల్లో ఉన్నాడని అర్థమైంది. చంద్రబాబు సభలకు జనం రావడంలేదని, లేనిజనాన్ని చూపించడానికే సందులు, గొందుల్లో సభలు పెడుతున్నారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.

అలాంటి సిగ్గులేని, నీతిమాలిన పనులు చేయడం నీకేతెలుసు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకోసం చేసే పాదయాత్రను కూడా పార్ట్ టైమ్ గా చేసిన ఘనుడివి నువ్వే. కోర్టు పనిమీద హైదరాబాద్ వెళ్లడానికి గురువారం మధ్యాహ్నమే పాదయాత్రకు విరామమిచ్చి, తిరిగి సోమవారం ప్రారంభించేవాడివి కదా జగన్ రెడ్డి! మిగిలినరోజుల్లో రోజుకి రెండు, మూ డు గంటలుమాత్రమే యాత్రచేసేవాడు. తన పాదయాత్రలో జనంలేక, సాక్షిమీడియా కెమెరా ల గిమ్మిక్కులతో, సాంకేతికపరిజ్ఞానంతో జనం ఉన్నట్టు గ్రాఫిక్స్ క్రియేట్ చేయించేవాడు. గ్రాఫిక్స్, డ్రోన్ షాట్లతో లేని జనాన్ని ఉన్నట్టు చూపించడం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు జగన్ రెడ్డి.

జనంనుంచి పుట్టిన తెలుగుదేశంపార్టీ. సానుభూతి, శవరాజకీయాల నుంచి పుట్టింది వైసీపీ
మాపార్టీ జనంనుంచి పుట్టింది. ప్రజాబలం ఉన్న పార్టీ. 40 ఏళ్ల చరిత్ర ఉన్నపార్టీ. మా కార్యకర్తల త్యాగాలతో తెలుగుదేశంపార్టీ నిర్మాణం జరిగింది. అలాంటి పార్టీకి జనాదరణ, జనాభిమానం కొత్తకాదు. పార్టీకోసం పరితపిస్తూ, అసువులుబాసిన కార్యకర్తల మృతిపై సాటికుటుంబసభ్యులుగా అందరం బాధపడుతున్నాం. నీ పార్టీలాగా సానుభూతినుంచి, శవరాజకీయాల నుంచి పుట్టిన పార్టీకాదు. మా అధినేతసభలకు, టీడీపీ సమావేశాలకు జనం స్వచ్ఛందంగా, సంతోషంగానే తరలివస్తారు.. వస్తున్నారు. నీకులాగా జనాన్ని రప్పించడంకోసం వాలంటీర్లను, వైసీపీనేతల్ని ఉపయోగించడం లేదు. మీకులాగా బెదిరింపులు, ప్రలోభాలను నమ్ముకోవడంలేదు. నీ సభలకు అరకొరగావచ్చే ప్రజల్ని కట్టడిచేయడంకోసం, నీ వంకరభాషకు దండంపెట్టి పారిపోయేవారిని నియంత్రించడంకోసం నీకులాగా మేం పోలీసుల్ని అడ్డుపెట్టుకోవడం లేదు.

జగన్ రెడ్డీ… నీ పాదయాత్రకు చంద్రబాబు ఎంతమంది పోలీసులతో భద్రత కల్పించారో తెలియదా?
జగన్ రెడ్డి గతంలో నీ పాదయాత్ర షెఢ్యూల్ ప్రకారం జరిగేలా చూడటానికి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చేయడానికి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగారు, 250 నుంచి 300మంది డీఎస్సీ స్థాయి అధికారులతో కూడిన పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించారు. మీకులాగా, మీ ప్రభుత్వం లాగా పోలీసుల్ని ప్రతిపక్షనేతసభలకు పంపకుండా, ప్రజల్ని గాలికొదిలేయలేదు. ప్రతిపక్షనేత సభలకు ప్రభుత్వం పోలీస్ బందోబస్త్ సరిగా ఏర్పాటుచేస్తే, కందుకూరు ఘటన జరిగేదే కాదు. చంద్రబాబు కందుకూరు సభకు కేవలం 100మంది పోలీసుల్ని పంపారు. అక్కడ దుర్ఘటన జరిగాక మరో 200మందిని పంపినట్టు ఉత్తుత్తిగా రికార్డుల్లో నమోదుచేశారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు నీకు, నీ ప్రభుత్వానికే సాధ్యం. కందుకూరు దుర్ఘటనపై దేశప్రధాని స్పందించాక, ఎప్పుటికో తీరుబడిగా నువ్వు స్పందించావు జగన్ రెడ్డి. నీకున్న ప్రచారపిచ్చి ఎవరికీ లేదు జగన్ రెడ్డి. ప్రతి పథకానికి నీపేరు.. నీతండ్రి పేరేనా?

అంబేద్కర్ పేరుతీసేసి, నీ పేరు పెట్టుకోవడం నీ ప్రచారపిచ్చికి పరాకాష్టకాదా జగన్ రెడ్డి?
టీడీపీప్రభుత్వం జాతీయస్థాయినేతల పేర్లతో రాష్ట్రంలో పథకాలు అమలుచేస్తే, నువ్వు అధికారంలోకి వచ్చాక వారిపేర్లను తొలగించి, పథకాలన్నీ రద్దుచేశావు. నీ ప్రభుత్వం ఉత్తుత్తిగా అమలుచేసే పథకాలన్నింటికీ నీపేరు, నీ తండ్రిపేరే పెడుతున్నావు. అది నీ ప్రచారపిచ్చికి పరకాష్ట కాదా జగన్ రెడ్డి? అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం అని చంద్రబాబు పేరుపెడితే, దానిపేరు జగనన్న విదేశీవిద్య అని పెట్టావు. ఆఖరికి నీ రంగులపిచ్చితో జాతీయ చిహ్నాలకు కూడా నీపార్టీ రంగులేయించావు.
మరీ దిగజారి చిన్నపిల్లలు తినే కోడిగుడ్లు, పుస్తకాలబ్యాగులమీద, వారుకట్టుకునే టైలు, వేసుకునే షూస్ మీద కూడా నీ బొమ్మలు, నీ పార్టీ రంగులేయించావు. నీ ప్రభుత్వంలో ఇచ్చే ఏ ప్రకటనలో కూడా సదరుశాఖ మంత్రి ఫోటో కనిపించదు, ఒక్క నీ ఫోటో తప్ప. శాశ్వత భూహక్కు పేరుతో ప్రజలకు ఇచ్చే పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు ఏంటి జగన్ రెడ్డి? రైతుల ఆస్తులపై నీ ఫోటోలేయడం నీ ప్రచారపిచ్చికి పరాకాష్ట కాదా? జగన్ రెడ్డికి ఉన్నంత పబ్లిసిటీ పిచ్చి, దేశంలో ఏ నాయకుడికి లేదనేది యధార్థం.

జగన్ రెడ్డి పాదయాత్రలో సంభవించిన మరణాలన్నీ ఆయన చేసిన హత్యలేనా? వైసీపీప్రభుత్వంలో చనిపోయినవారంతా ప్రభుత్వ నిర్వాకం వల్లే చనిపోయారా?
కందుకూరు దుర్ఘటనపై తనవక్ర బుద్ధి ప్రదర్శించి, తానేమిటో జగన్ రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నాడు. తన పాదయాత్రలో సంభవించిన మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలేనా? కచ్చులూరు బోటుప్రమాద మరణాలు, జంగారెడ్డిగూడెంలో కల్తీమద్యంతో సంభవించిన మరణాలన్నీ వైసీపీప్రభుత్వ హత్యలుకావా? నీ తండ్రి మరణవార్త విని కొద్దిమంది చనిపోతే, వందలమంది చనిపోయారంటూ, ఓదార్పు యాత్రపేరుతో రాజకీయాలు చేసింది నువ్వు జగన్ రెడ్డి! నీపార్టీ కార్యకర్త ఎవరైనా చనిపోతే, వారి కుటుంబసభ్యుల్ని నీ ప్యాలెస్ కి పిలిపించి మాట్లాడే కుసంస్కారం నీది. మా అధినేత చంద్రబాబు నైజం అలాకాదు..
మాపార్టీ కార్యకర్తలు చనిపోయారన్న బాధను గుండెల్లో దాచుకొని వారి ఇళ్లకు వెళ్లి, కుటుంబసభ్యుల్ని అక్కునచేర్చుకొని ఓదార్చి, ధైర్యం, స్థైర్యం ఇచ్చారు. మీకు నేను అండగా ఉన్నాను.. బాధపడకండి అని ఓదార్చాడు. అదీ నాయకుడి లక్షణం. నీ పార్టీకి చెందిన ఒక దళితఎంపీ చనిపోతే, కనీసం అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా నువ్వు వెళ్లలేదు కదా జగన్ రెడ్డి? ఎంపీ కుటుంబసభ్యుల్ని నీవద్దకు పిలిపించుకున్నావు. అదీ నీ కుసంస్కారం. నీ సామాజికవర్గం వారు చనిపోతే ఎగేసుకొని వెళ్తావు.

నీకు, చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసంఅదే. నీ సభలన్నీ జనంలేక వెలవెలబోతుంటే, చంద్రబాబుసభల్లో జనసునామీ కనిపిస్తోంది. తుపాన్లు, వరదలు వచ్చినా చంద్రబాబు సభలనుంచి ప్రజలు కదలడంలేదనిచెప్పడానికి బాపట్ల సభే నిదర్శనం. టీడీపీ సభలకు వస్తున్న జనసునామీ దెబ్బతో జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరకి వచ్చింది. తన దుర్మార్గపు విధానాలు, తనప్రభుత్వ పనితీరుపై, సొంతపార్టీ ఎమ్మెల్యేలే ఆయన్ని ఛీకొడుతున్నా, జగన్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు” అని ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

LEAVE A RESPONSE