Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర పారిశ్రామిక రంగం దుస్థితి.. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై కోతికత్తి ముఖ్యమంత్రి, కోడి..గుడ్ల మంత్రి బహిరంగ చర్చకు రాగలరా?

• ఇప్పటివరకు రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలెన్ని, పెట్టుబడులెన్ని… యువతకు కల్పించిన ఉద్యోగాలెన్నో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి
• రాబోయే జనవరితో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 జనవరులు పూర్తవుతాయి. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏ జవనరిలో ఇచ్చాడో జగన్ చెప్పాలి
• యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ పలుమార్లు ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై ఈ ప్రభుత్వాన్ని నిలదీసినా, సవాళ్లు విసిరినా సమాధానం లేదు
• జగన్ రెడ్డి అసమర్థత, చేతగానితనంతో ఉపాధి లేక రాష్ట్రంలో 450కి పైగా యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ మరణాలన్నీ జగన్ చేసిన హత్యలే
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీని బహిష్కరించి, తన చేతిలోని సొంత మీడియా సాయంతో యువత సహా అన్ని వర్గాలను దారుణంగా వంచించాడని, ‘అన్న వస్తున్నాడు’.. ‘నేను ఉన్నాను-నేను విన్నాను’ అంటూ ఊదరగొట్టి ప్రజల్ని ఒక్కఛాన్స్ అని నమ్మించి, అధికా రంలోకి వచ్చాక నట్టేట ముంచాడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెం డ్ల బ్రహ్మం తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

“ రాబోయే జనవరి-1 జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వస్తున్న 5వ జనవరి. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్ రెడ్డి.. 5 జనవరులు కలిపి ఇప్పటివరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చి, ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చాడో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి అయ్యి 4 ఏళ్ల 8 నెలలు పూర్తవుతున్నా కూడా జగన్ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు…ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేసిందిలేదు.
ఏ రాష్ట్రానికి అయినా అభివృద్ధికి తలమానికంగా నిలిచేది పారిశ్రామికరంగమే. అలాంటి రంగం అభివృద్ధికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాడో, రాష్ట్రానికి కొత్తగా ఎన్ని పరిశ్రమలు, ఎన్నివేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

ఆ మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను రెండింటినీ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి, ఎలాంటి ఉపాధి చూపక, ఏ విధమైన ఉద్యోగాలు ఇవ్వక యువత బంగారు భవిష్యత్ ను నాశనం చేశాడు. చంద్రబాబు హయాంలో ప్రైవేట్ రంగంలో యువతకు 6లక్షల ఉద్యోగాలు లబిస్తే, డీఎస్సీలు, పోలీస్ రిక్రూట్ మెంట్, గ్రూప్స్ నోటిఫికేషన్లతో ప్రభుత్వ రంగంలో 4లక్షల ఉద్యోగాలు కలిపి దాదాపు 10లక్షలకు పైగా ఉద్యో గాలు లభించాయి. అసెంబ్లీ సాక్షిగా ఈప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డే టీడీపీప్రభుత్వం ప్రైవేట్ రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పాడు.

తనపాలనలోజగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయాడు. పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకు రాకుండా, యువతకు ఉపాధి కల్పించకపోవడంతో నిరాశానిస్పృహలతో సుమా రుగా 450 మందికి పైగా యువత ఆత్మహత్యలకు పాల్పడింది. ఈ విషయం కేంద్రప్రభుత్వమే చెప్పింది. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్య లే. చనిపోయిన యువత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతా డని ప్రశ్నిస్తున్నాం.

ఎఫ్.డీ.ఐల ఆకర్షణలో చంద్రబాబు హాయాంలో రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉంటే, జగన్ రెడ్డి పాలనలో 11వ స్థానానికి దిగజారింది
కోడి..గుడ్లు అంటూ కథలు చెప్పే పరిశ్రమల శాఖా మంత్రి, యువతను వంచించి న కోడికత్తి ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, ఎన్ని వేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారో యువతకు సమాధానం చెప్పాలి. కాలికి బలపం కట్టుకొని, చంద్రబాబు దేశవిదేశాలు తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చిన లులూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్, హెచ్.ఎస్.బీసీ వంటి సంస్థలతో పాటు, రాష్ట్రంలో ఉన్న అమర్ రాజా సంస్థ కూడా ఏపీకి గుడ్ బై చెప్పేశాయి. జగన్ నిర్వాకంతో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన 6లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కుపోయాయి. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రానికి రూ.60వేలకోట్లకు పైగా ఎఫ్.డీ.ఐలు తీసుకొచ్చి, దేశంలోనే ఏపీవాటాను 14.7శాతానికి పెంచి, జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలిపారు.

కానీ జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రం 11వ స్థానానికి దిగజారింది. తమకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతపై అక్రమకేసులు పెట్టించడంలో మాత్రం జగన్ ముందున్నాడు. నిరుద్యోగుల ఆకలి కేకలు వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినిపించడం లేదా? వారి కుటుంబాలరోదన కనిపిం చడం లేదా? అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే మంచిపేరు తెచ్చు కుంటానన్న ముఖ్యమంత్రి, ఇన్నేళ్లలో యువతకు ఎందుకు న్యాయం చేయలేదో సమాధానం చెప్పాలి.

తమ పాలనలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం కోడి..గుడ్ల మంత్రికి, కోడికత్తి ముఖ్యమంత్రికి ఉందా?
ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ అవినీతి, దోపిడీ, దొంగఓట్ల సృష్టిపై పెట్టిన శ్రద్ధలో సగం కూడా యువత ఉపాధికల్పనపై పెట్టలేదు. చివరకు చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతిని కూడా రద్దుచేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను కక్షసాధింపులతో నిర్వీర్యం చేశారు. నిజంగా జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తే, ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాల్లో ఏర్పాటుచేసిన పరిశ్రమలు.. కల్పించిన ఉద్యోగాలు.. ఉపాధి అవకాశాల పై చర్చకు రాగలరా అని సవాల్ విసురుతున్నాం. ప్రభుత్వంతో తాము ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇప్పటికే నారా లోకేశ్ ఈ అంశంపై యువ గళం పాదయాత్రలో పలుమార్లు ప్రభుత్వానికి సవాల్ విసిరినా, పాలకుల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

‘హలో లోకేశ్’ పేరిట నిరుద్యోగ యువత, విద్యార్థులతో లోకేశ్ మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నాకే ఈప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆయన సవాల్ కు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ స్పందించలే దు. ఇప్పుడు తాను కోడి..గుడ్ల మంత్రికి, కోడికత్తి ముఖ్యమంత్రికి నిరుద్యోగ యువత తరుపున చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. నిరుత్సాహం, నిర్వేదం తో రాష్ట్రయువత, నిరుద్యోగులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, టీడీపీ ప్రభుత్వం రాగానే వారి ఆశలు, ఆశయాలు కచ్చితంగా నెరవేరుతాయి. యువగళంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి లోకేశ్ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.” అని బ్రహ్మం భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE