– మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటాం
– చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్ కు ముందకొచ్చిన టాటా గ్రూప్
మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, ఇక్కడికి వస్తే సొంత ఊరు వచ్చిన భావన కలుగుతుందని బ్రాహ్మణి అన్నారు.
చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, టాటా తనేరా సిఈవో అంబూజ నారాయణ ప్రారంభించారు. వీవర్ శాలలో ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను ,కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. తగిన ప్రోత్సాహకాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కార్మికులు రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తామని బ్రాహ్మణి తెలిపారు.
టీడీపీ ఎన్ ఆర్ ఐ విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్ శాలలో అధునాత మగ్గాలతో సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారుచేస్తారు. చేనేతలకు టెక్నాలజీ వినియోగంలో సహకరించేందుకు, వారు నేసిన చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది. మంగళగిరి చేనేతకు అంతర్జాతీ గుర్తింపు పొందేలా సహకరిస్తామని, నిషి పుట్టినప్పటి నుంచి మరణించేవరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం.భారతీయత సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం, మరియు మన దేశానికి గర్వకారణంఅని తనేరా సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ కు చేందిన రమణా రమణారెడ్డి ,శాలిని, పాల్, ఎన్ ఆర్ ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్, బుచ్చిరాం ప్రసాద్, నందం అబద్ధయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.