Suryaa.co.in

National

విశ్వాస పరీక్షలో గెలిచిన కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష లో గెలుపొందారు. ప్రభుత్వంపై శుక్రవారంనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా, శనివారం సభలో చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో ఆయన సభా విశ్వాసం పొందారు. ఓటింగ్ సందర్భంగా 64 మంది ‘ఆప్‌’ ఎమ్మెల్యేలలో 54 మంది సభకు హాజరయ్యారు.

దీనికి ముందు చర్చలో కేజ్రీవాల్ పాల్గొంటూ, సభలో తమ పార్టీకి మెజారిటీ ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుండటంతో విశ్వాస తీర్మానానికి వెళ్లామని చెప్పారు. కేజ్రీవాల్ అరెస్టయితే పార్టీ కుప్పకూలుతుందని వారి అంచనాగా ఉందని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చునేమో కానీ కేజ్రీవాల్ ఐడియాలజీని ఎలా అరెస్టు చేస్తారని సీఎం ప్రశ్నించారు.

LEAVE A RESPONSE