Suryaa.co.in

Andhra Pradesh National

నిర్ణీత కక్ష్యలోకి ఇన్సాట్-3డీఎస్

శ్రీహరికోట:- సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని ఈ వాహననౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది.

LEAVE A RESPONSE