తెలుగు సినీ పరిశ్రమ కు మకుటంలేని మహారాజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ..యన్టీఆర్ మనుమడు!
ఒక అగ్రనటుడి ముద్దుల మేనల్లుడు..అల్లుడూ..!
అంతకు మించి..విజనరీ…దేశం మెచ్చిన నాయకుడి కొడుకు..!
విద్యావంతుడు..!
తను నిర్వహించిన శాఖలో అత్యధిక అవార్డులు సాధించిన ఘనుడు.మంచి పని వాడు..!
ఇదీ అతని నేపధ్యం!
తరం మారుతుంది..!
స్వరం మారుతున్నది..!
వాళ్ళ తండ్రిగారు వందేమాతరం.
సరళంగా సున్నితంగా మాట్లాడతారు..
మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నాము ..రండి సార్ అంటే..
ముందు నిరాకరిస్తారు..
ఒత్తిడి చేస్తే నేల మీద బాసింపట్టు వేసుకుని నిరసన తెలియచేస్తారు.
ఇతను..కొత్తగా పదును పెట్టిన కంకుల కొడవలి..
సహనం ఉన్నది..అంతే స్ధాయిలో దూకుడు ..
ఏక కాలంలో ప్రదర్శించగలుగుతాడు.
తండ్రి చాటు బిడ్డ కాదు ఇప్పుడు..మధ్యాహ్నం మార్తాండుడు..!
మొత్తగా ఉంటే మొత్తుతారు అని తెలుసుకున్నాడు.
మాటతీరు మారింది ..
రూపు రేఖా లావణ్యాలు మారాయి..
హేళన చేసిన నోళ్ళు మూగబోతున్నాయి..
నివ్వెరపోయి చూస్తున్నారు..
కళ్ళలో కసి కనిపిస్తుంది..
నిలబడాలి..కలబడాలి అనుకుంటున్నాడు..
మార్పు తనతోనే మొదలెట్టాడు..
అశేష అభిమానులు..సానుభూతి పరులు ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు.
సాధన చేయుమురా నరుడా
సాధ్యము కానిది లేదురా..
కవి హృదయం కళ్ళముందు కనిపిస్తుంది..
సాధనమున పనులు సమకూరు ధరలోన..
కుర్రాడు బాబోయ్ ..జోరు మీదున్నాడు.
పాట డీజే లో వినపడుతున్నది.
ఎక్కడో చిత్తూరులో ఒక బుడ్డోడు ఆటో నడుపుతున్నాడు.
ఎవరూ చెప్పలేదు.
సామజిక మాధ్యమాల్లో చూసి తెలుసుకున్నాడు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దాం అనుకోలేదు.
మన ప్రభుత్వం రావాలని కొబ్బరికాయ కొట్టమనలేదు.
మంచాన పడి కాసేపో కూసేపో అనేవారిని..నేనొచ్చిన తర్వాత చేస్తాననలేదు..అప్పటికప్పుడు తక్షణ సాయం అందించాడు.
పాదయాత్ర పొడవునా జనం గుండె చప్పుడు వింటున్నాడు.
చేతనయినది తక్షణం చేసేస్తున్నాడు..
చెప్పాడంటే చేస్తాడు.. ఇతను!
అతనో..అసలు చెప్పడు..చెప్పితే అసలు చెయ్యడు.
చంద్రబాబు అంబుల పొదిలో పాశుపతాస్త్రం.
హేళన చెక్కిన శిల్పం.
తెలుగు వాడి రోషం పౌరుషం..నిలువెల్లా నింపుకున్నోడు.
నాయుడి కొడుకు ఇప్పుడు నాయకుడు.
– శ్రీనివాస్