-ప్లేస్, టైం నువ్వే చెప్పు
-సాక్షి, సజ్జల కాదు దమ్ముంటే నువ్వేరా
-కదిరి శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్
బాబాయిని చంపింది ఎవరు? తనకు న్యాయం చేయాలని కోరుతున్నది ఎవరు? మీ బాణం కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసింది ఎవరు?సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు న్యాయం చేస్తాడా?
దేశానికి సంక్షేమానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. కిలో 2కే బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు.
దీపం పథకం అందించిన వ్యక్తి చంద్రబాబు. జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, టిడ్కో ఇళ్లు కట్టించిన వ్యక్తి చంద్రబాబు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానని మోసం చేశారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని మోసం చేశారు.
ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి, మహిళల పేరుపై 30 లక్షల ఇళ్లు కడతానని మోసం చేశారు. కనీసం 3వేల ఇళ్లు కూడా కట్టలేదు.
పాదయాత్రలో నన్ను ప్రొఫెషనల్ కోర్సులు చదువుకునే వారు కలిశారు. కలలకు రెక్కలు పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు చేసే మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని హామీ ఇస్తున్నా.
అభివృద్ధికి అర్థం జగన్ కు తెలుసా ?నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అనేక సంస్థలు, పరిశ్రమలు తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు. జగన్ ఉన్న చంచల్ గూడ జైలును కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు.
టైం, డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై జగన్ తో చర్చకు నేను సిద్ధం. విజయసాయిరెడ్డిని, సాక్షి, సజ్జలను పంపిస్తానంటే కుదరదు.
కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోనే 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.
మీ అందరి ఆశీస్సులతో 3132 కి.మీ పాదయాత్ర చేశా. కదిరిలో నేను సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నా.టీడీపీ-జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం.
స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతోంది.
గత ఐదేళ్లుగా మీరు బీసీలకు ఏం చేశారు. 26వేల మందిపై దొంగ కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు. 30 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. 75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ ను పక్కదారి పట్టించారు.
బీసీల కష్టాలు చూశాం. అందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. రూ4వేలు అందిస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం.
బీసీలకు ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించింది. సాధికారత కోసం రూ.పదివేల కోట్లు, ఆదరణ కింద రూ.5వేల కోట్ల పనిముట్లకు ఖర్చుపెడతాం.
పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. డ్రిప్ ను రద్దు చేశారు. జగన్ ది దరిద్రపు పాదం. 30 ఏళ్లలో ఎన్నుడూ లేని కరవు వచ్చింది. రూపాయి కూడా ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వలేదు.
హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పెండింగ్ లో ఉన్నాయి. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు జరగడం లేదు. టీడీపీ హయాంలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే నేడు నిలిపివేశారు.
కదిరి ప్రజల జోషే వేరు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి.మన హయాంలో 1200 కోట్లతో చాంద్ బాషా, ప్రసాద్ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏనాడైనా పెండింగ్ పనుల కోసం పోరాడారా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే అవినీతిలో సిద్ధహస్తులు. పుట్టపర్తి ఎమ్మెల్యే అవినీతితో పోటీ పడుతున్నాడు. సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి 8కోట్లు వసూలు చేశాడు. అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాలి. రింగ్ రోడ్డు పనులకు పూర్తిచేయకుండా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు.
కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా డబ్బులు కాజేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే. దేవుడితో పెట్టుకున్నావ్… నీ పని గోవిందా గోవిందా. మన ప్రభుత్వంలో వంద రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తిచేసి గృహప్రవేశాలు చేసుకుందాం.
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. వైకాపా నేతల పేర్లు కూడా ఉన్నాయి. మన ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం. జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి జైలుకు పంపిస్తాం.
రెడ్ బుక్ పై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతున్నారు. నేను కదిరిలోనే ఉన్నా. తప్పు చేసి ఉంటే ప్రజల ముందు నిలబెట్టి అరెస్ట్ చేయాలి. పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు