Suryaa.co.in

Andhra Pradesh

నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్

టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్
నారా లోకేష్ ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు అలర్ట్ మెసేజ్
బయట పెట్టిన యాపిల్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం
తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కు అధికారుల సహకారం
గుడివాడ అమర్ నాథ్ , రామచంద్రారెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్.
ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జగన్ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారన్నారు.. ప్రతిపక్ష నేతలు, ఎలక్షన్ కమిషన్ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్
175 నియోజకవర్గాల్లో ప్రనిత్ రావ్ లను ఏర్పాటు చేసుకుని తాడేపల్లి కేంద్రంగా అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్లు ట్యాప్ చేయిస్తూ జగన్ రెడ్డి జనం వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతున్నాడని దేవినేని మండిపడ్డారు. దీన్ని అనాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయట పెట్టినట్లు తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లపై వెంటనే జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

అధికారుల అండతో ఫోన్ ట్యాపింగ్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపణల్లో అధికారులు కటకటాల్లోకి వెలుతున్నా… జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న ఈ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అడిషనల్ డీజీ, డీఎస్పీలు: నరేంద్రరెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లు ఫోన్ ట్యాపింగ్ కు సహకరిస్తున్నారని దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీ కనక మేడల ఫిర్యాదు చేసినట్లు దేవినేని తెలియజేశారు. ముందే శాసన సభ, శాసన మండిలిలో ఫోన్ల ట్యాప్ల పై ప్రశ్నించినట్లు గుర్తు చేశారు.

వైసీపీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్…
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాఫ్ట్ వేర్ తో తాడేపల్లి ప్యాలెస్ నుండి వైసీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. వైసీపీ మంత్రలు గుడివాడ అమర్ నాథ్ , రామచంద్రారెడ్డి, మరి కొంత మంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు చెప్పినా ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ నేతల రహస్య వివరాలను కూడా ఫోన్ ట్యాపింగ్ లతో జగన్ రెడ్డి తెలుకుంటున్నారని విమర్శించారు.

టీడీపీ వర్క్ షాప్ లో వివరాల చోరికి యత్నం
విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో వివరాలను సేకరించి జగన్ రెడ్డికి పంపేందుకు కానిస్టేబుల్ విశ్వేశ్వరరావును జగన్ తొత్తులుగా పనిచేస్తున్న ఉన్నత అధికారులు పంరాని… అతన్ని టీడీపీ నాయకులు పట్టుకున్నారన్నారు. ఇలా జగన్ రెడ్డి అధికారులను అడ్డుపెట్టుని చంద్రబాబు, పవన్ కళ్యాన్, పురంధేశ్వరి, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఇలాంటి చర్యలు దేశ సమగ్రతను, వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్న అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.

ఫోన్ ట్యాపింగ్ లపై సజ్జల, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ హరెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. జగన్ రెడ్డి కోసం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ కు సహకరిస్తున్న అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అధికారులతో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉండదన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్చగా తమ ఓటును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలన్నారు. ఇటు వంటి అధికారలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

LEAVE A RESPONSE