రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారాయణ
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి ఆనం నివాసంలో…ఆయన్ని మంత్రి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘగంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ వెంట…టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డితో పాటు కపిర శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.