-విచారణ జరపాలంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వర్ల రామయ్య లేఖ
పోలీసుల కొట్టడం వల్లే నెల్లూరు దళిత యువకుడు నారాయణ చనిపోయాడని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ కు తెదేపా నేత వర్ల రామయ్య పిర్యాదు చేశారు. ఫిర్యాదు సారాంశం ఇదీ..
కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని మానవ హక్కుల ఉల్లంఘనల కేంద్రంగా మార్చారు.అధికార పార్టీపై అసమ్మతి తెలిపితే వైసీపీ నాయకులు పోలీసుల సహకారంతో ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ మండలంలోని కందమూరులో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఉదయగిరి నారాయణ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వస్తువులు దొంగిలించాడనే నెపంతో పోలీసులు నారాయణను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారు.అవమానం భరించలేక 19 జూన్ 2022న నారాయణ గ్రామ శివార్లలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.నారాయణ శరీరంపై దెబ్బల స్పష్టంగా ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదిక తెలుపుతోంది.
నారాయణ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. చోరీకి సంబంధించిన నిజానిజాలు రాబట్టేందుకు పోలీసులు నారాయణను కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేవలం అనుమానంతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడం అంటే ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పటమే.ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్.హెచ్.ఆర్.సి లేఖ రాసిన వర్ల. నారాయణ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన రామయ్య.