Suryaa.co.in

Telangana

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి కట్టడి కి నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్లు

– తర్వలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు
– పాత కలేక్టరేట్‌‌‌‌‌‌‌‌లో,సైబరాబాద్ నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌ కోసం హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట, రాచకొండ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయిని కట్టడి చేసేందుకు నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానున్నాయి. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర మాదకద్రవ్యాల కేసులను దర్యాప్తు చేయనున్నాయి. టీజీ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌లు పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌‌‌‌‌‌‌‌ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్‌‌‌‌‌‌‌‌లో నార్కొటిక్స్ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. కేసులు నమోదు చేయడంతో పాటు నిందితుల అరెస్ట్, గంజాయి, డ్రగ్స్ రవాణాకు అడ్డకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించనున్నారు. నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదయ్యే కేసులను దర్యాప్తు చేస్తారు.

ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కేసులు నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌లకే
స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు రిజిస్టర్ చేసే కేసులను కూడా నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేస్తారు. ప్రతి పీఎస్‌‌‌‌‌‌‌‌కు డీఎస్పీ స్టేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నారు. లా అండ్ ఆర్డర్ పీఎస్‌‌‌‌‌‌‌‌లలో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై నియమించనున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటికే టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించింది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరును కనబరిన పోలీస్ సిబ్బందిని నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌లలో నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ప్రస్తుతానికి హైదరాబాద్ నార్కొటిక్ పీఎస్ కోసం నాంపల్లిలోని హైదరాబాద్ పాత కలేక్టరేట్‌‌‌‌‌‌‌‌లో,సైబరాబాద్ నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌ కోసం హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట, రాచకొండ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనున్నారు. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌లో నమోదు అయ్యే కేసులను నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది దర్యాప్తు చేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A RESPONSE