Suryaa.co.in

Andhra Pradesh

రాజధానిపై “బుగ్గన” మాటలు నీటి మూటలు…

నవీన్ కుమార్ రెడ్డి

మూడు రాజధానుల పేరుతో పరోక్షంగా ఏపీ సీఎం “మిస్ కమ్యూనికేషన్” చేశారని ప్రకటించిన ఆర్థిక మంత్రిని “బర్తరఫ్” చేయాలి! రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు “కమ్యూనికేషన్ గ్యాప్” ఉందన్న విషయం బుగ్గన ప్రకటనతో తేలిపోయింది! ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ ఒక్కటే అని రాజధాని అంశం సుప్రీం కోర్టులో పెండింగ్ లో వుండగా ఓ బాధ్యత గల ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం “సబ్ జుడీస్” అవుతుంది, ముమ్మాటికి కోర్టు ధిక్కారమే! ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అని “మిస్ కమ్యూనికేషన్” చేశారని ఒక బాధ్యత గల ఆర్థిక మంత్రి ప్రకటించడం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2020 లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్,జ్యూడిషియల్ క్యాపిటల్ అని “మిస్ కమ్యూనికేషన్” చేశారని ఆర్థిక మంత్రి బహిరంగంగా చెప్పకనే చెప్పి ప్రకటించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు! ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు “రోజుకో మాట పూటకో ప్రకటన”తో గందరగోళం సృష్టిస్తూ “దాగుడుమూతలు” ఆడుతున్నాయని మండిపడ్డారు!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధాని 2015 లో విభజన చట్టం ప్రకారమే ఏర్పాటు అయిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు బిజెపి పెద్దలు పదేపదే ప్రకటిస్తూనే ఉన్నారు! ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న 3 కాదు వైజాగ్ ఒక్కటే రాజధాని అని ప్రకటించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండు నాలికల ధోరణికి నిదర్శనం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తూ బాధ్యత గల ప్రజాప్రతినిధులు రాజధాని విషయంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “శిఖండిలా” మారడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం ! ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాకపోవడంతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాక పెట్టుబడిదారులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర మంత్రులు “డైవర్షన్ పాలిటిక్స్” చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు!

LEAVE A RESPONSE