భాజపాకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకులు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అడ్డాకు మెయిల్ ద్వారా పంపారు. సోము వీర్రాజు కక్ష సాధింపులు కుటిల రాజకీయాలు వల్లే పార్టీని వీడుతున్నాను. 2014లో బిజెపిలో చేరానని ఆ రోజు నుంచి పార్టీ అభ్యున్నతికి పార్టీ ప్రతిష్టకు కృషి చేశా. 2019లో 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టగలిగాను. అదే సమయంలో పాలక ప్రతిపక్ష పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలను పార్టీలోకి తీసుకురాగ లీగా. పదవుల కోసం ఎప్పుడూ పనిచేయలేదు.. పనిచేస్తుంటే పదవులు వాటి అంతట అవే వస్తాయి…. జివిఎల్ నరసింహారావు ఓవర్ నైట్ లో నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాడు… భవిష్యత్తు కార్యాచరణను కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తాను. ఆయనతోపాటు మరి కొంతమంది రాజీనామా చేయనున్నారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…
2014లో బీజేపీ లో చేరాను అప్పట్టి నుంచి సామాన్యకార్యకర్తల పనిచేశాను. 10మాసాలు అధ్యక్షుడు గా పనిచేసి175 నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే లను నుంచోపెట్టాను. అధికారమే లక్ష్యంగా పనిచేశాను, అనేక మంది సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. వైసీపీ అధినేత అనాలోచిత నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైసీపీ పై ప్రజా పోరాటాలు చేసాను. వైసీపీ రాష్ట్రంలో పగా,ప్రతికరాల తో ప్రతిపక్షాల పై నిప్పులు చేరుగుతున్న వారిపై పోరాటాలు చేసాను. బీజేపీ ఇంతవరకు నాతో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఒక్కరోజుతోనే నాయకులు కాలేరు… కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు విషయంలో అన్యాయం జరిగిందని అందరికి తెలుసు. జీవిఎల్ సీనియర్ నాయకుడు ఆయన ఏదయినా మాట్లాడవచ్చు. సమస్యలపైపార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అన్నది నా అభిప్రాయం. సోము వీర్రాజు ప్రవర్తన సరిగా లేకపోబట్టే రాజీనామా చేస్తున్నాను. సీనియర్ నేతగా ఏ పార్టీలో ఆశించి పనిచేయలేదు …కష్టపడి పనిచేయడం నా అలవాటు. ఏపీకి లో కాపులు ఎలాంటి సందిగ్ధంలో లేరు.
Shri-J-P-Nadda-JI-Resignation-Letter-Adapa-Siva-Nagendra-Rao16022023
Shri-J-P-Nadda-JI-Resignation-Letter-Thalla-Venkatesh-Yadav-16022023
Shri-J-P-Nadda-JI-Resignation-Letter-16022023

Leave a Reply