– ఎన్డీఏ కూటమి కి 16-19 స్థానాలు
– పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడి
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.
పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి.
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్పీఏ కూటమిలోని డీఎమ్‌కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి. పుదుచ్చేరిలో దాదాపు 68 శాతం మంది ముఖ్యమంత్రిగా ఎన్.రామస్వామికి మద్దతిస్తున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని దాదాపు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. పుదుచ్చేరిలో అభివృద్ధికి సంబంధించి 56 శాతం మంది ఏఐఎనఆర్‌సికి మద్దతివ్వగా, 24 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు.