Suryaa.co.in

Features

నీలం..కీర్తి కలకాలం!

ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది
నలభై ఒకటా..
ఓసోస్..
ఓడింది ఒకటా..
కటకటా..
ఇంతకీ..ఆ ఒక్కటీ గెలిచిన మొనగాడు ఎవరో..
ఆ కాలంలో
అదెంత కలకలం..
అదే నీలం..
రాజకీయాల్లో హిమాచలం..
అచంచలం..!

నీలం సంజీవరెడ్డి..
రాజీపడక ఎన్ని రాజీనామాలో..
నిఖార్సయిన
రాజకీయాలకు
ఈ ఇల్లూరు వాసి
హస్తవాసి..!

ఇతరులకు పదవులు
ఇవ్వడానికి కొన్నిసార్లు..
ఊ అనలేక..
ఉహూ అనరాక..
ఇంకొన్ని మార్లు
పదవులకు సదా అల్విదా
అందుకే జాతి నీలానికి ఫిదా!

మొత్తానికి వద్దనుకున్నా
పదవులు నీలం
ఇంటి ముందే పహారా..
సిద్ధాంతాలే
ఆయనకు సహారా..!

స్వరాజ్య సంగ్రామంలో
ప్రధాన పాత్ర..
సగం జీవితం
కటకటాల వెనకే..
స్వతంత్ర భారతంలో
ఎన్నో కీలక ఘట్టాలకు
ఆయన సాక్షి..
మంచికి మాత్రమే ఔనంది
మనస్సాక్షి..!

సాధించిన ఆంధ్రకు సారథి
యావజ్జాతికే రథసారథి..
ఆదర్శ రాజకీయాలకు
తానే వారధి..
నిబద్ధతే పరిధి..
నీతినిజాయితీలతో నిండిన
కీర్తే ఆయన
మిగిల్చి వెళ్లిన
అఖండ నిధి..!

జననేత..జనతా మహానేత..
దివంగత మాజీ రాష్ట్రపతి
నీలం సంజీవరెడ్డికి నివాళి

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE