Suryaa.co.in

Telangana

టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరాకేఫ్ బీసీ సంక్షేమ శాఖ లోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ

– మంత్రి పొన్నం ప్రభాకర్

హైద‌రాబాద్‌: నెక్లెస్ రోడ్డులో ఉన్న నీరాకేఫ్ టూరిజం శాఖ పరిధిలో ఉండడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పలు మార్లు చర్చలు జరిపి నీరాకేఫ్ భవనం దాని పరిధిలో ఉన్న ఆస్తులను తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు కి బదిలీ చేస్తూ ఈరోజు ఇరు శాఖల మంత్రులు ఒప్పందాల పై సంతకాలు చేయడం జరిగింది. ఇప్పటి దాకా టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరాకేఫ్ ఇక నుండి కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నడవనుంది.

కల్లు గీత కార్మికులకు అండగా ఉంటూ వారి ఆందోళనను తొలగిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వారీగా అండగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నీరాకేఫ్ టూరిజం నుండి టాడీటాపర్ ఫెడరేషన్ కి బదిలీ అంశం ఒప్పందం పూర్తవడంతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు లకు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE