• విజయరావు డీజీపీ అయితే రాష్ట్రంలోని దళితుల్ని ఊచకోత కోయిస్తాడు.
• దళితుల శవాలపై నడిచి వెళ్లి, విజయరావు డీజీపీ కావాలనుకుంటున్నాడా?
• దళితుల్ని చంపుతున్నవారిని వదిలేసి, వారికోసం పోరాడే వారిపై ఎస్పీ కక్షకట్టాడు.
• నెల్లూరుఎస్పీ విజయరావు, కావలి డీఎస్సీ, సర్కిల్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్ దళితులైనా కావలిలో దళితులప్రాణాలకు రక్షణ లేదు.
• అర్థరాత్రి అరెస్ట్ లు, బెదిరింపులతో దళితులకోసం పోరాడుతున్న నన్ను ఆపలేరు.
– టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు
దళితుడైన నెల్లూరుఎస్పీ విజయరావే దళితుల ప్రాణాలు తీస్తున్నవారికి కొమ్ముకాస్తూ, తనజాతి కుటుంబాలను రోడ్డునపడేస్తున్నాడని, వైసీపీనేతలకు ఊడిగంచేస్తూ, దళితుల కోసం పోరాడుతున్న నన్ను అక్రమకేసులతో భయపెట్టాలని చూస్తున్నాడని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులకు నిరసనగా ఛలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చాం. దళితయువకుడు దుగ్గిరాల కరుణాకర్ ని చంపిని వారిని కఠినంగా శిక్షించా లని గతంలోనే డిమాండ్ చేశాం. కరుణాకర్ ఘటన మరువకముందే తేజ, హర్ష అనే దళిత యువకులపై వైసీపీనేతలు దాడికి పాల్పడ్డారు. పైడి హర్ష వైసీపీనేత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంచేసి, చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. హర్ష చికిత్సకు ఇప్పటికే రూ.11లక్షలు ఖర్చయ్యాయి. అతను ఇప్పటికీ చావుబతుకులతో కొట్టుమిట్టాడుతూ, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. కావలిఎమ్మెల్యే అతని బినామీ మహేశ్ నాయుడు ఇన్నిదారుణాలకు పాల్పడుతున్నా పోలీసులు స్పందించరు.
అర్థరాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి, 600కిలోమీటర్లు తిప్పారు.
ఛలో కావలి కార్యక్రమం కోసం అనంతపురం నుంచి కావలికి బయలుదేరిన నన్ను వింజమూరు అటవీప్రాంతంలో యూనిఫామ్ లేని కొందరు పోలీసులమంటూ, బైకులపై వచ్చి అడ్డుకున్నారు. అర్థరాత్రి 2 గంటలకు ఎస్.ఆర్.పురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, అక్కడినుంచి స్టేషన్ వెనుకవైపు నుంచి పోరుమామిళ్ల, మార్కాపురం, బద్వేలు ప్రాంతాలు తిప్పి, చివరకు సోమశిల ప్రాజెక్ట్ స్టేషన్ కు తరలించారు. మరలా అక్కడినుంచి వేరే వాహనంలో వింజమూరు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆఖరికి వాహనంమార్చి, ఒంగోలు టోల్ గేట్ వద్ద నన్ను వదిలేశారు. దళితులపై దాడిచేస్తున్నవారిని రక్షించడానికే నెల్లూరు ఎస్పీ, నన్ను అర్థరాత్రి అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు తిప్పాడా?
శాంతిభద్రతల సమస్య అని నన్ను అరెస్ట్ చేయడంకాదు.. పోలీసులకు దమ్ముంటే తక్షణమే కావలి ఎమ్మెల్యేని జిల్లానుంచి బహిష్కరించాలి
ఎస్పీ హింసిస్తేనో, ప్రభుత్వం భయపెట్టి తప్పుడు కేసులుపెడితేనో తాము దళితులకోసం పోరాడకుండా ఆగుతామా? ఈ ప్రభుత్వం, పోలీసులు తమను ఎంత అణచివేస్తే, అంతగా తిరగబడతాము. నెల్లూరుఎస్పీగా విజయరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయగిరి నారాయణ అనే దళుతుణ్ణి, ఎస్.ఐ.కరిముల్లా స్టేషన్లో చంపేస్తే అతనిపై చర్యలు లేవు. ఆ ఘటనపై మాపార్టీనేతలు ఆనంద్ బాబు, అనిత, నేను, ఎస్పీని ప్రశ్నిస్తే, తమను బెదిరించినట్టు మాట్లాడాడు. లేడీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వచ్చిన మహిళా అభ్యర్థుల కొలతలు మగపోలీసులు తీసుకోవడం, కాకాణి కేసుఫైళ్ల చోరీ వ్యవహారంపై తాను మాట్లాడాననే నెల్లూరుఎస్పీ తనపై కక్షకట్టాడు. అలానే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయడంకోసం ఛలో నెల్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చి, జరిగిన దారుణాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, రవిచంద్ర, జెన్ని రమణయ్యతో కలిసి తాము జాతీయఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము. దాంతో కమిషన్ నెల్లూరులో పర్యటించి, నారాయణ కుటుంబానికి న్యాయంజరిగేలా చేసింది. ఆ వ్యవహారంకూడా ఎస్పీకి కంటగింపుగా మారింది.
దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎమ్మెల్యే అనుచరులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మరికొందరు కారణమని లేఖరాస్తే, దాన్నికూడా తప్పుపట్టేలా పోలీసులు వ్యవహరించారు. దానిపై కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యేవరకు తాముపోరా డామని, నారా లోకేశ్ కరుణాకర్ కుటుంబాన్ని ఆదుకున్నారని నెల్లూరు ఎస్పీ కక్షపెంచు కున్నాడు. కేతిరెడ్డిని కాపాడటానికి జిల్లా ఎస్పీ, కలెక్టర్ చేయాల్సిందంతాచేశారు. పోలీసులు అధికారపార్టీకి ఎంతగా ఊడిగం చేస్తారో చెప్పడానికి, నా అరెస్టే పెద్ద నిదర్శనం. నేను కావలికి వస్తే, శాంతిభద్రతల సమస్య తలెత్తదు. కానీ పోలీసుల దుర్మార్గాలు, వారు వైసీపీకి తొత్తు లుగా వ్యవహరిస్తున్న తీరు బయటపడుతుంది. మహేశ్ నాయుడు బూటుకాలితో తేజను బహిరంగంగా తంతే, ఇనుపరాడ్ తో కొడితే, అతనికి పోలీసులు 41(ఏ) నోటీస్ ఎలా ఇస్తారు? పోలీసులు నిజంగా శాంతిభద్రతలు కాపాడేవారే అయితే తక్షణమే కావలి ఎమ్మెల్యే ప్రతాప కుమార్ రెడ్డిని జిల్లానుంచి బహిష్కరించాలి. మహేశ్ నాయుడు కావలి ఎమ్మెల్యే బినామీ అనే అతని దుర్మార్గాలను పోలీసులు పట్టించు కోవడంలేదు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాపకుమార్ రెడ్డి కనుసన్నల్లో రేషన్ మాఫియా వేలకోట్లు దోచేస్తోంది. కావలిలో జరిగే భూకబ్జాలు, సెటిల్ మెంట్లు నెల్లూరుఎస్పీకి కనిపించడంలేదా?
దళిత ఐపీఎస్ విజయరావు ఎస్పీగా ఉన్నజిల్లాలో దళితులపై దమనకాండ సిగ్గుచేటు
చంద్రశేఖర్ అనే దళితయువకుడు అంబేద్కర్ విగ్రహానికి దండేస్తే, డీఎస్పీ శివాజీరావు అకార ణంగా దూషిస్తాడా? అమ్మ, ఆలీ, అక్క అంటూ నోరుందని దుర్భాషలాడతాడా? ఉన్నత స్థానంలో ఉన్న డీఎస్పీని తిట్టడం మాకు చేతగాదా? చట్టాలు, సెక్షన్లు ఆయనకే తెలుసా? నెల్లూరు ఎస్పీ విజయరావు, కావలి డీఎస్సీ, సర్కిల్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్ అందరూ దళితులే, కానీ వారే దళితుల్ని బలితీసుకుంటున్న వారిని కాపాడుతున్నారు. దళితుల శవాలపై నడిచి విజయరావు డీజీపీ కావాలనుకుంటున్నాడా? దళిత కుటుంబాల రక్తాన్ని రోడ్లపై పారిస్తూ, పదవులకోసం పాకులాడటానికి ఆయనకు సిగ్గులేదా?
దళిత ఐపీఎస్ అధికారి ఎస్పీగా ఉన్న నెల్లూరుజిల్లాలోనే దళితులపై దమనకాండ సాగడం నిజంగా దళిత జాతికే సిగ్గుచేటు. ఎస్పీ విజయరావు రాష్ట్ర డీజీపీ అయితే ఏపీలో దళితుల్ని ఊచకోత కోయించేలా ఉన్నాడు. చనిపోయిన దళితయువకుల్ని ఎస్పీ తీసుకురాగలడా? మృతుల కుటుంబాలకు కావలి ఎమ్మెల్యే న్యాయంచేస్తాడా? ప్రశ్నించేవారిపక్షాన, పాలకుల బాధితులపక్షాన తాము పోరాడకూడదా? మమ్మల్ని అణచడంపై ఎస్పీ పెడుతున్న శ్రద్ధలో సగమైనా, ఆయన వైసీపీనేతల దందాలు, దోపిడీపై పెట్టాలి. వైసీపీప్రభుత్వం, పోలీసుజులుంతో దళితజాతిని అణచివేయాలనుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే.
నెల్లూరులో దళితులపై దమనకాండ సాగుతున్నా, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నోరెత్తరు. చంద్రబాబుని తిట్టడానికి, జగన్ రెడ్డి భజన చేయడానికి పదవులకోసం బానిసత్వం చేస్తున్నారు. దళితులపై జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతున్నా స్పందించలేని బతుకులు బతికితే ఎంత..లేకుంటే ఎంత? నెల్లూరులో అధికారపార్టీ నేతల దుర్మార్గానికి, పోలీస్ క్రౌర్యానికి బలైన దళితకుటుంబాలకు న్యాయంజరిగే వరకు తమపోరాటం ఆగదు” అని రాజు తేల్చిచెప్పారు.