Suryaa.co.in

Andhra Pradesh

పడుపువృత్తిలో రాష్ట్రాన్ని తొలిస్థానంలో నిలపడం జగన్ రెడ్డి సాధించిన మహిళా సాధికారత?

• పింఛన్ అడిగిన మహిళలపై గూండాగిరీ చేయడమేనా?
• గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న రోజా తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు
• జగన్ రెడ్డిని ఒప్పించి ఆత్మరక్షణకోసం మహిళలకు రివాల్వర్లు ఇప్పించే బాధ్యత, రోజా, ఇతరమహిళానేతలు తీసుకోవాలి
• దేవినేని అవినాశ్ గూండాగిరీకి బలైన మైనారిటీ మహిళలకు మహిళామంత్రులు, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ ఏం సమాధానం చెబుతారు? – పింఛన్ అడిగినవారిని చావ చితక్కొట్టండి అని జగన్ చెప్పాడా?
– దేవినేని అవినాశ్ గూండాల దాడిలో గాయపడిన రమీజా.
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత

మహిళల్ని కాపాడలేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని, చంద్రబాబు సభలకు జనం వస్తున్నారని జీవోనెం-01 తెచ్చిన పోలీసులు, అధికారులు, ఆడ బిడ్డల మానప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రిని ఎందుకు రాష్ట్రంనుంచి బహిష్క రించరని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆమె విజయవాడలో దేవినేని అవినాశ్ గూండాలచేతిలో గాయపడిన మైనారిటీ మహిళలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు వారిమాటల్లోనే …“పింఛన్ అడిగిన మైనారిటీ మహిళల కళ్లల్లో కారంకొట్టి, వారిని చితగ్గొట్టడమేనా జగన్ రెడ్డి సాధించిన మహిళాసాధికారత? విజయవాడలో మైనారిటీపై మహిళలపై వైసీపీ గూండాల దాడిపై హోంమంత్రి ఏం చెబుతుంది? రాష్ట్రంలో ఏంజరుగుతున్నా హోంమంత్రి ఎల్లప్పుడూ హోమ్ కే పరిమితమవుతున్నారు. స్వయంప్రతిపత్తితో చంద్రబాబుకి నోటీసులిచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సామాన్యమహిళలకు అండగా నిలవదా? మహిళా కమిషన్ జగన్ కమిష న్ గా మారిందన్నది పచ్చినిజం.

చేతనైతే పింఛన్ ఇవ్వండి..లేకపోతే మూసుక్కూర్చోండి
పింఛన్లు తీయడం లేదని, అలా దుష్ప్రచారంచేసే ప్రతిపక్షాలను బూతులు తిట్టండి అని జగ న్ ఐఏఎస్ లకు హితబోధ చేశాడు. కావలిలో పింఛన్ కోల్పోయిన వృద్ధదంపతులు బలవన్మ రణానికి పాల్పడలేదా? నిన్న విజయవాడలో పింఛన్ అడిగిన మైనారిటీ మహిళలపై దాడిచేస్తారా? చేతనైతే పింఛన్ ఇవ్వండి…లేకపోతే మూసుక్కూర్చోండి. ప్రజలు మీ చేతగా నితనాన్ని ప్రశ్నిస్తే వారిపై దాడిచేస్తారా?
తనకు పింఛన్ వచ్చనా ఇవ్వకుండా, ఎందుకు ఆపారని అడగడమే రమీజా చేసిన నేరమా? అవినాశ్ గూండాలు రమీజా, ఆమె కుటుంబసభ్యుల్ని కొట్టి, తిరిగి వారే బట్టలు చించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, బాధితులపైనే తప్పుడు కేసులు పెడతారా? దేవినేని అవినాశ్ దాష్టీకానికి బలైన మైనారిటీ మహిళలకు మహిళామంత్రులు ఏం సమాధానం చెబుతారు? విజయవాడలో మైనారిటీ మహిళలపై జరిగిన దాడిని జాతీయమహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లబోతున్నాం.

జీవోనెం-01 తెచ్చిన అధికారులు, పోలీసులు మహిళల్ని కాపాడలేని ముఖ్యమంత్రిని కూడా రాష్ట్ర బహిష్కరణ చేయాలి
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మహిళలపై దాడులకు సంబంధించి ఏపీలో రోజుకి 45 కేసులు నమోదు అవుతున్నాయి. ఆ నివేదిక రాగానే డీజీపీ మహిళలపై నేరాలే లేవని బుకాయించాడు. నిన్న అడిషనల్ డీజీ కూడా రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని పచ్చి అబద్ధాలాడాడు. కత్తులు, చాకులు, సుత్తులు, గొడ్డళ్లతో వైసీపీ కాలకేయులు రోడ్లపై తిరుగు తుంటే డీజీపీకి కనిపించడంలేదా? మహిళాకమిషన్, దిశాపోలీసులు, మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. టీడీపీసభలకు జనం వస్తున్నారని జీవోనెం-01 ఇచ్చిన పోలీసులు, అధికారులు, ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడలేని జగన్ రెడ్డిని బ్యాన్ చేయరా?

జగన్ రెడ్డి మహిళోద్ధరణ అంటే పడుపువృత్తిలోకి వెళ్తున్నవారి జాబితాలో ఏపీని తొలిస్థానంలో నిలపడమా?
మహిళోద్ధరణ అంటే పడుపువృత్తిలో ఏపీని తొలిస్థానంలో నిలడపమా జగన్ రెడ్డి? బతుకుదెరువు లేక రాష్ట్రమహిళలు వేశ్యలుగా మారుతున్నారంటే, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి అన్ ఫిట్. మహిళల కడుపు నింపలేని సీఎం ఉంటే ఎంత..పోతే ఎంత? జగనన్న వస్తే మంచి జరుగుతుందన్న విజయమ్మ, షర్మిలే రాష్ట్రంవదిలిపోయారు. తోటిమహిళల జీవితా లు మంటగలుస్తున్నా, జగన్ భార్య భారతి స్పందించదు. జగన్ రెడ్డి పులికాదు.. ప్రజల్ని హింసించే పులకేశి కంటే ఘోరంగా మారాడు. ‘ఛలో కావలి’ కి వెళ్లిన ఎం.ఎస్.రాజుపై వైసీపీ చొక్కాలేసుకున్న పోలీసులు రౌడీయిజం చేశారు.

ఆత్మరక్షణకోసం మహిళలకు రివాల్వర్లు ఇవ్వాలి
గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న జబర్దస్త్ రోజాని చూసి జనం నవ్వుతున్నారు. గన్ కంటే ముందు జగన్ రాడు, రాలేడు. ఆయన చేతగానివాడు, చేవలేని వాడని రాష్ట్రంలోని ఆడ బిడ్డలకు అర్థమైంది. కనీసం మహిళలకు వారి ఆత్మరక్షణకోసం రివాల్వర్లు ఇప్పించే బాధ్యత రోజా తీసుకోవాలి. చీకటిజీవో ఇచ్చినట్టే రివాల్వర్ల పంపిణీకి కూడా జగన్ తక్షణమే జీవో ఇవ్వాలి. రివాల్వర్లు ఇప్పించాల్సిన బాధ్యత వైసీపీ మహిళానేతలపైనే ఉంది” అని అనిత చెప్పారు.

పింఛన్ అడిగితే చావగొట్టండి అని జగన్ చెప్పాడా? : దేవినేని అవినాశ్ గూండాల దాడిలో గాయపడిన రమీజా
“పింఛన్ అడిగినవారిని చావ చితక్కొట్టండి అని జగన్ చెప్పాడా? గడపగడపకు అంటూ మా ఇంటికి వచ్చారు. నాకు పింఛన్ వస్తే, డబ్బులు ఎందుకివ్వరని అడిగాను. దానిపై డబ్బులు పడటంలేదు.. వస్తాయిలే అంటూ వెళ్లిపోయారు. దేవినేని అవినాశ్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనతో తిరిగాను. పోయిన ఎన్నికల్లో కూడా జెండాలుపట్టుకొని ఆయనతో తిరిగాం. పింఛన్ వచ్చినా ఎందుకు ఇవ్వరని అడిగితే, తెల్లారేసరికి ఇంటిపైకి వచ్చి, కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో చావగొ డతారా? భూలక్షి, చిన్నారి, దామోదర్, సహా 20మంది వైసీపీ వాళ్లు నాఇంటిపైకి వచ్చారు. పక్కసందులో రామిరెడ్డి ఉండి, రక్తం రాకుండా కొట్టండి అని వారికి చెబుతున్నాడు. దేవినేని అవినాశ్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగాము. ఇప్పుడు ఆయనతోనే ఉన్నాం. న్యాయం చేయమనడమే మేం చేసిన నేరమా? పొద్దున పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి, రాత్రి 9వరకు తిండి, నీరు లేకుండా కూర్చోబెట్టారు. దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, జనసేన వాళ్లు వస్తే, ఆ నా కొడుకులు ఏం చేస్తారు, వెళ్లి అవినాశ్ తో మాట్లాడుకోండి అని ఎస్ఐ వెటకారంగా మాట్లాడాడు. మీ రాజకీయం కోసం మాలాంటి వాళ్లను బతకనివ్వరా? టీడీపీ అయితేచంపేస్తారా? ఇకనుంచి టీడీపీలోనే ఉంటాం.. ఏం చేస్తారో చేయండి.”

జగన్ సార్, ఆడబిడ్డలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారు : షైలు (రమీజా కోడలు)
“జగన్ సార్.. గుర్తుంచుకోండి ఆడబిడ్డలు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చూస్తారు. కులాల గురించి మాట్లాడామని, గంజాయి బ్యాచ్ అని మహిళలని కూడా చూడకుండా మాపై దాడిచేశారు. విజయవాడలో గంజాయి అమ్మేది ఎవరో పోలీసులకు తెలియదా? పిల్లతల్లిని, ఆపరేషన్ చేయించుకున్నాను అనికూడా చూడకుండా బొత్సమాధవి తలగోడకేసి కొట్టి, గొంతుపై కాలేసి బూటుకాళ్లతో తొక్కింది. ఏం పని ఉందని వైసీపీవాళ్లు నిన్న మా ఇంటికి వచ్చారు? అవినాశ్ చెప్పారని మమ్మల్ని కొట్టినా పడిఉండాలా? నాఇల్లు పడగొడతా రని వాలంటీర్ చెప్పింది. ఎందుకు పడేస్తారు? మీరు చెబితే కష్టపడి కట్టుకున్న ఇల్లువదిలి పోవాలా? మీరు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లుకట్టడం అయ్యేపనేనా? కనీస వసతులు లేని చోటకు వెళ్లమంటే ఎలా వెళ్తారు?”

LEAVE A RESPONSE