ఆ పోలీసు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం

-పుంగనూరులో అక్రమ కేసులు, అరెస్టులపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ
-వైసీపీ గుండాలతో చేతులు కలిపిన కొందరు పోలీసులకు డీజీపీ కూడా మద్దతుగా నిలుస్తున్నారని లేఖలో పేర్కొన్న టీడీపీ అధినేత
– డిసెంబర్ నెల నుండి నేటి వరకు పుంగనూరులో టీడీపీ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసుల వివరాలను ప్రస్తావిస్తూ లేఖ
– వివిధ సెక్షన్ ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘిస్తున్నారో చెపుతూ లేఖ రాసిన చంద్రబాబు నాయుడు

లేఖలో అంశాలు:-
పుంగనూరులో టీడీపీ వారిపై కేసుల్లో సాధారణంగా ఫిర్యాదుదారులు పోలీసులు లేదా స్థానిక రెవెన్యూ అధికారులు ఉంటున్నారు.ఫిర్యాదుదారు సిద్ధంగా ఉండి, నిందితుల జాబితాలో పాటు FIRలో ‘ఇతరులను’ చేర్చుతున్నారు.ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 307 లేదా SC/ST వేదింపుల నిరోధక సెక్షన్ లు పెడుతున్నారు.

రాష్ట్రంలోని మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె, తదితర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.ఎఫ్‌ఐఆర్ నం. 2/2023లో పేర్కొన్న రెవెన్యూ అధికారి ఫిర్యాదులో టీడీపీ నేతలపై మాత్రమే కఠినమైన సెక్షన్ లు పెట్టారు. వైసిపి నేతలపై సాధారణ సెక్షన్ల తో నామమాత్రపు కేసు పెట్టారు.ఈ చర్యలు పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఎత్తిచూపుతున్నాయి.

రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం కోసమే టీడీపీ మద్దతుదారులపై ఈ అక్రమ కేసులు అని కోర్టు లో రిమాండ్ ల తిరస్కరణ ద్వారా అర్ధం అవుతోంది.ఈ కేసులు ఒక వర్గం పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య జరిగిన కుమ్మక్కుకు సాక్ష్యం.పలు సందర్భాల్లో పోలీసు యూనిఫాం ధరించకుండా, నేమ్ బ్యాడ్జ్ ధరించకుండా వచ్చి నిందితులను తీసుకు వెళ్తున్నారు.ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించడమే.

ఇంత పెద్దఎత్తున చట్టాన్ని ఉల్లంఘించిన ఆ పోలీసు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకుంటే, రాబోయే కాలంలో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని గుర్తుంచుకోవాలి.

Leave a Reply