ఎన్.ఆర్.ఐ సెల్ ఆధ్వర్యంలో ఆరుగురికి ఉద్యోగాలు

-16 మంది వైద్య ఖర్చులకు రూ.7.5 లక్షల ఆర్ధిక సాయం
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వైద్యం ఖర్చులకు సాయం అందించిన టీడీపీ ఎన్.ఆర్.ఐ సెల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ పవర్మెంట్ సెంటర్ నందు శిక్షణపొందిన ఆరుగురు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభించింది. ఇక ఎన్.ఆర్.ఐ టిడిపి ఖతార్, యూఎస్ఏ డేలావర్ ద్వారా రూ.7.5 లను 16 మందికి వైద్య ఖర్చులకు గాను ఆర్థిక సాయాన్ని ఎన్. ఆర్. ఐ టీడీపీ అందించింది. వైద్య సహాయం కోసం అందించిన మొత్తం నగదులో ఖతార్ విభాగం రూ.5.5 లక్షలు 15 మందికి, డేలావర్ కమిటీ రూ.1,85,000లను కిడ్నీ మార్పిడి వైద్యం కోసం అవనిగడ్డ వాసికి అందించారు.

ఖతార్ కమిటీ రూ.10 లక్షల చెక్కును పార్టీకి విరాళంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈనెల 1న అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయిడు, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి , పోలీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, డాక్టర్ రవి వేమూరి, ఎన్నారై టీడీపీ కో-ఆర్డినేటర్లు కే.బుచ్చ రాం ప్రసాద్, చప్పిడి రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ ఏ ఎస్ రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇటువంటి సేవా కార్యక్రమాలను అమలు చేయగలుగుతోందని, ఏ పార్టీకి ఇటువంటి ఘనత లేదని చెప్పారు. ఉద్యోగాలు పొందిన యువతను ఆయన అభినందిస్తూ వారు కూడా సమాజానికి తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని కోరారు. వైద్య ఖర్చు నిమిత్తం సహాయం కోరేవారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి తగిన సూచనలు పొందాలన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు ఆర్థిక సహాయం అందించిన ఖతార్ ఎన్నారై టిడిపి ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణ, వైస్ ప్రెసిడెంట్ మద్దిపాటి నరేష్ , గల్ఫ్ టీడీపీ ప్రెసిడెంట్ రావి రాధాకృష్ణ మరియు టిడిపి లీడర్లు కే సుధాకర్ రావు, ఎం సత్యనారాయణ గారి వారి కమిటీ సభ్యులందరికీ మరియు డేలావర్ కమిటీ అధ్యక్షులు సత్య పొన్నగంటి తోపాటు వారి కమిటీ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply