-కోలుకున్న తర్వాత తిరిగి సీఐడీ చీఫ్‌గా రానున్న సంజయ్
అమరావతి: రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ పి.ఎస్.ఆర్.ఆంజనేయలు సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జి హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా పనిచేస్తున్న సంజయ్ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లు ఆయనికి సర్జరీచేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సంజయ్ కోలుకుంటున్నారని, తిరిగి రాగానే సీఐడీ చీఫ్‌గా యథాస్థానంలోకి వస్తారని సీడీఐ కార్యాలయం స్పష్టంచేసింది. అప్పటివరకూ పీఎస్‌ఆర్ ఆంజనేయలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది.