వైసీపీ ప్రభుత్వ పాలనలో క్రైస్తవులకు ఒరిగిందేం లేదు

Spread the love

-క్రీస్తు బోధించిన శాంతి, సామరస్యం జగన్మోహన్ రెడ్డికి గిట్టదు
– టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల ఇమాన్యుయేల్ (మ్యాని)

శత్రువును ప్రేమించమని క్రీస్తు బోధిస్తే…తన అవినీతికి అడ్డొచ్చే వారిని తొలగిస్తానని రాజారెడ్డి రాజ్యాంగం చెబుతోంది. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో క్రైస్తవులకు ఒరిగిందేం లేదు. పథకాల ఫలాలు అందడంలో అడుగడుగునా అన్యాయమే జరిగుతోంది. క్రైస్తవులను కేవలం ఓటుబ్యాంకుగానే జగన్మోహన్ రెడ్డి పరిగణించడం బాధాకరం. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలకు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. చర్చీల నిర్మాణం కోసం చంద్రబాబు గారు కోట్ల రూపాయిల నిధులు కేటాయించారు. గుంటూరులో రెండు ఎకరాలలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి భూమితో పాటు రూ. 10 కోట్లు వ్యయం కూడా చేస్తే ఇంతవరకూ దాన్ని పూర్తిచేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి.

టీడీపీ హయాంలో చంద్రన్న క్రిస్మస్ కానుక పేరుతో రూ. 230 కోట్ల విలువ చేసే సరుకులను ఉచితంగా పేద క్రైస్తవులకు అందించగా వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్ధాక్షణ్యంగా నిలిపేశారు. పండుగ కానుకలు ఇవ్వకపోగా రకరకాల పన్నుల భారం మోపుతూ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. టీడీపీ హయాంలో క్రిస్టియన్ మైనారిటీ విద్యార్ధుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, టూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ చేయగా..జగన్ రెడ్డి సాయం చేయకపోగా ఎయిడెడ్ కాలేజీలను నిర్వీర్యం చేస్తుండటం దారుణం.

దశాబ్ధాల చరిత్ర కలిగిన క్రైస్తవ విద్యాసంస్థలను బెదిరింపులకు పాల్పడి దోచుకోవాలని చూస్తున్నారు. కుల, మత , ప్రాంతాల వారీగా ప్రజలను విభజించి అరాచకం సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం. సర్వమత సంక్షేమాన్ని కాంక్షించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పండుగ కానుకలను పునరుద్ధరిస్తుంది. నిలిచిపోయిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి పట్టాలెక్కిస్తుంది.

Leave a Reply