– మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైనది
– రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగుల సంక్షేమం యన్.చంద్ర శేఖర్ రెడ్డి
– అక్టోబర్ 2వ తేదిన ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతగా సెల్యూట్ సి.యం సర్
– గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా
-పాలనా సౌలభ్యం కోసం,అవినీతి రహిత సమాజం కోసం ఉద్యోగ వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది పలికిన సి.యం కు కృతజ్ఞతలు:బండి.శ్రీనివాస రావు
-చిరకాల వాంఛ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే జీవిత ఆశయం నెరవేరిన వేళ సచివాలయ ఉద్యోగుల హర్షాతిరేకం
-తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ప్లేకార్డులు ప్రదర్శిస్తూ సెల్యూట్ -సి.యం సర్ అంటూ నినదించిన సచివాలయ ఉద్యోగులు
-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ తో కూడిన కొత్త జీతం
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నూతన వ్యవస్థను సృష్టించి లక్షా ముప్ఫయి నాలుగు వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని ఇది చెరగని చరిత్ర అని సువర్ణ అధ్యాయం అని తెలిపారు. ఈ లోగా మనసున్న ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు చేసిన వారి నోర్లు మూగబోయాయి.సచివాలయ ఉద్యోగులకు వరమైన ఈ శుభవార్త,కొందరు కుట్రదారులకు చెంపపెట్టు లా నిలిచిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు యన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై 1వతేది నుండి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతం అందిస్తామని చెప్పినట్లుగానే, కోటి ఆశలతో కొత్త జీతం కోసం ఎదురు చుసిన సచివాలయ ఉద్యోగులు ఆగస్టు 1తేదీన పెరిగిన వేతనాలు అందించారని తెలిపారు.
బండి.శ్రీనివాస రావు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక నవ చరిత్రకు నాంది పలుకుతూ ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఏపీఎన్జీవో అసోసియేషన్ తరపున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి న్యాయమైన సమస్యను పరిష్కరిస్తామని అదేరకంగా ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రోబేషన్ హోల్డ్ చేయబడిన ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని,ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించాలని,కారుణ్య నియామకాలు కల్పించాలని,ఇతర అన్నీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జానీ పాషా మాట్లాడుతూ ఈ క్రమంలో ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాదని,తాత్కాలికమేనని,పదిహేను వేల రూపాయలకు మించి జీతం పెరగదని ఉద్యోగులను కించపరిచే విధంగా అనేక అవాస్థవాలను ప్రచారం చేశారు. ఈ క్రమంలో జనవరి నెలలో వీరందరికి సచివాలయ ఉద్యోగులపై ఎనలేని ప్రేమ పుట్టుకొని వచ్చి,మీకు మేము అండగా ఉన్నామంటూ కపట ప్రేమ నటించి ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. సచివాలయ ఉద్యోగులు అక్టోబర్2వ తేదీన ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సి.యం సర్ కార్యక్రమం నిర్వహించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీయన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి,ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి జి.నవీన్ కుమార్ నాయకులు కె.రామకృష్ణా రెడ్డి, మనోహర్,యస్.కె.రహీం,మహిళా నాయకులు బి.శ్వేతా,సుజాత,జెమ్మి విక్టర్ తదితరులు పాల్గున్నారు.