ఎప్పుడు నీ తత్త్వానికి వ్యతిరేకంగా నీ మనసు పని చేస్తుందో అప్పుడు నీ సుప్త చేతన నీకు సందేశాన్ని ఇస్తుంది. మొదటి సారి కాస్త మర్యాదగా, ఆ తర్వాత నెమ్మదిగా ఇస్తుంది. నువ్వు వినకపోతే పీడ కల రూపంలో ఇస్తుంది.
పీడ కల అనేది నీ సుప్త చేతన స్థితి గొంతు తప్ప మరొకటి కాదు. నువ్వు నీకు చాలా దూరంగా వెళ్ళినప్పుడు, నీ సమస్త అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నిరాశ చేసే ఆక్రందనే ఈ పీడ కలలు. ఇంటికి తిరిగి రా!!! అది ఎలాంటిది అంటే బిడ్డ చెట్ల గుంపులో తప్పిపోతే తల్లి కన్నీళ్లు పెట్టడం లాంటిది. అరవడం లాంటిది. ఏడవడం లాంటిది. పిల్లవాడిని పిలవడం లాంటిది. పీడ కల అంటే ఖచ్చితంగా అదే. కాబట్టి నీ కలలతో నువ్వు స్నేహంగా ఉండటం మొదలు పెట్టు.
క్రమక్రమంగా నువ్వు నీ సుప్త చేతన దగ్గరికి రావడం, సన్నిహితం కావడం చూస్తావు. మీరు సన్నిహితంగా వస్తే, దగ్గర అయితే నీకు జ్వరం వచ్చిన కలలు వస్తాయి. ఎందుకు అంటే అప్పుడు కల అవసరం ఉండదు. అప్పుడు నువ్వు మేల్కొని ఉన్నప్పుడు కూడా నీ సుప్త చేతన నీకు సందేశాన్ని ఇస్తుంది. నువ్వు నిద్ర పోయినప్పుడే దాని కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అది ఏ సమయంలో అయినా నీకు సందేశాన్ని ఇస్తుంది.
మీరు మరింత మరింత దగ్గరగా అయ్యే కొద్ది చేతన, సుప్త చేతన రెండూ ఒక దగ్గర కలుస్తాయి. అది అపూర్వ అనుభవం. మొదటి సారి నువ్వు ఏకత్వాన్ని అనుభూతి చెందుతావు. నీ అస్థిత్వంలో ఏ పార్శ్వాన్ని తిరస్కరించడం అంటూ ఉండదు. నీ సంపూర్ణత్వాన్ని నువ్వు ఆమోదిస్తావు. నువ్వు సంపూర్ణంగా మారడం ప్రారంభిస్తావు.
– ఎంబీఎస్ గిరిధర్‌రావు