రైతులు వ్యవసాయంతో పాటు ఆర్ధిక పరిపుష్టి సాధించేందుకు లాభదాయకమైన పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి కనబరచాలి. పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాల. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక యాంత్రికరణ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపాలి. గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకానికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది.
రైతులతో పాటు నిరుద్యోగ యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటోంది. తక్కువ పెట్టుబడితో పెంపకం చేపట్టే వీలుండటం, ఈ కోళ్లకు వ్యాధుల బెడద తక్కువగా ఉండటం , స్థానికంగా విక్రయించే సౌలభ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి . దీంతో ఈ రంగం వైపు యువత అడుగులు వేస్తోంది. నిజానికి పెరటి కోళ్ల పెంపకం గ్రామీణ భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది.
ఈ దేశీయ కోళ్ల నుంచి మాంసం, గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండేది. ఒక్కో కోడి నుంచి ఏడాదికి 70 నుంచి 80 గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన కోళ్లతో పెంపకం చేపట్టి మాంసం, గుడ్ల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. రైతుల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగు పరచడానికి తక్కువ ప్రారంభ పెట్టుబడితో పెరటికోళ్ల పెంపకం చేపట్టవచ్చు.
లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యవసాయ సంబంధ వ్యాపారం ప్రారంభించాలనుకుంటూ ఉంటే దేశీయ కోళ్ల ఫారమ్ సరైన ఎంపిక! నాటు కోళ్లను గ్రామీణ లేదా పెరటి కోళ్లు అని కూడా పిలుస్తారు. దేశీయ కోళ్లు స్థానిక వాతావరణాలకు బాగా అనుకూలం మరియు వాణిజ్య జాతులతో పోలిస్తే తక్కువ మేత మరియు తక్కువ మౌలిక సదుపాయాల అవసరాలు కలిగి ఉంటాయి.
స్థిరమైన ఆదాయాన్ని పొందాలని చూస్తున్న చిన్న తరహా రైతులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దేశీయ కోళ్ల ఫారమ్‌తో సంవత్సరానికి 6 లక్షల వరకు
ఆదాయం పొందవచ్చు. గుడ్లు, మాంసం, కోడిపిల్లల విక్రయం ద్వారా ఈ ఆదాయం రావచ్చు. దేశీ కోడి గుడ్లు ప్రత్యేకమైన రుచితో ఉంటాయి. అంతే కాకుండా వీటిలో పోషకాలు కూడా ఎక్కువ. దేశం కోడి గుడ్లు మరియు మాంసం అనేక ఆరోగ్య మరియు పోషక ప్రయోజనాలను అందిస్తాయి. లేయర్ చికెన్ ఈ నాటీ కోళ్ల గుడ్లతో పోల్చితే ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి.
ఈ నాటీ కోళ్ల గుడ్లను యాంటీబయాటిక్స్ ఫ్రీ అని చెబుతారు. అందువల్ల ఇవి వినియోగానికి ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన ఎంపికగా అని నిపుణులు చెబుతున్నారు. దేశ కోడి మాంసం కూడా ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఐరన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మరియు బ్రాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పోషక ప్రయోజనాలతో పాటు, దేశం కోడి గుడ్లు మరియు మాంసం పర్యావరణ మరియు సామాజిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్లే ఈ నాటి కోళ్ల గుడ్లకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్డును రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక నాటి కోళ్ల మాంసం కిలో రూ.500 వరకు పలుకుతుంది. దేశీయ కోళ్ల ఫారమ్‌ను ప్రారంభించడం చాలా సులభం మరియు సరసమైనది.
ప్రారంభ పెట్టుబడిలో కోడిపిల్లలు, ఫీడ్ మరియు ప్రాథమిక గృహాల కొనుగోలు ఉంటాయి. కోళ్ల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను నిర్ధారించడానికి తగిన స్థలం, స్వచ్ఛమైన నీరు మరియు సమతుల్య ఆహారం అందించడం చాలా ముఖ్యం. కోడిని పెంచి పోషించే విధానంపైనే దాని గుడ్ల దిగుబడి ఆధారపడి ఉంటుంది. కోళ్ళ పోషణ వాటి వయస్సును బట్టి మూడు దశలుగా విభజించబడుతుంది.
కాబట్టి వాటి యాజమాన్య పద్ధతులు కూడా కోళ్ళ వయస్సును బట్టి మారతాయి. కోడి శరీర నిర్మాణం చలిని తట్టుకొనే విధంగా మలచబడింది. కాబట్టి, ఎక్కువ ఉష్ణోగ్రతకు కోడి తట్టుకోలేదు. ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకన్నా ఎక్కువ ఉన్నపుడు, కోళ్ళు ఆయాసపడుతూ తక్కువ మేత తింటాయి. ఎక్కువ నీళ్ళు తాగుతాయి. తీవ్ర పరిస్థితుల్లో వడదెబ్బకు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. అందుచేత వేసవిలో కోళ్ళ పెడులను సాధ్యమైనంతవరకు చల్లగా ఉండేట్లు చూడాలి.
దీనికోసం కోళ్ళ షెడ్ ఎపుడూ తూర్పు పడమరలుగా కట్టుకుంటే ఉదయపు ఎండ, సాయంత్రపు ఎండ షెడ్లోనికి ప్రసరించదు. షెడ్ చుటూ కొద్ది ఎత్తు వరకు గడ్డిని పెంచటం లేక నీడనిచ్చే చెట్లను పెంచటం వలన కూడా వేడిని తగ్గించవచ్చు. పై కప్పులకి తెల్లని రంగువేసి, లేదా ఆపై గడ్డి పరచి, స్ప్రింక్లర్లతో తడిపితే మంచిది. ముఖ్యంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పడు షెడ్లో పంఖాలు నడుపడం మంచిది. చల్లని నీరు అన్ని వేళలా కోళ్ళకు అందుబాటులో ఉండాలి.
షెడ్లో సీలింగు పంకాలను అమర్చవచ్చు. షెడ్ ప్రక్కలను గోనెసంచులుకాని, వట్టివేళ్ళ తడికలనుకాని కట్టి, తరచుగా నీటితో తడిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. నీటి తొట్టెలు షెడ్ లోపల ఉండడం మంచిది. దేశవాళీ కోడి, గుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందుచేత గుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు మరియు వాటినుండి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి.
వీటిలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టడానికి వైట్ లెగ్ హార్న్ కోళ్ళ నుండి రూపొందించిన సంకరజాతి కోళ్ళు సాధారణంగా ఉపయోగించబడుచున్నవి. కోళ్ల పెంపకంలో పశుసంవర్ధక శాఖ నుంచి ప్రోత్సాహం లేదు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా కేవలం మేకలు గొర్లకు మాత్రమే రాయితీ ఉంది.
sసన్నకారు రైతులకు, పాడి పశు పోషణ రైతులకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది పౌల్ట్రీ రైతు అంబటి రామకృష్ణ, గౌతమ్ బుద్ద అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు డా యం సురేష్ బాబు తెలిపారు.