Suryaa.co.in

Andhra Pradesh

డీజీపీ కార్యాలయంపై వైసీపీ జెండా ఎగురవేస్తే ఇక ఎవరూ రారు

– బాబుకు విజ్ఞాపన చేయడానికి వస్తే రాళ్లు, కర్రలతో వస్తారా.?
– మీ ప్రకారం 16 నెలలు చిప్పకూడు తినడం లోకజ్ఞానమా.?
– దాడి చేస్తే చూస్తూ కూర్చుంటామా.? ప్రతిఘటన ఖచ్చితంగా చేస్తాం
– ప్రాణ రక్షణ కోసమే ప్రతిఘటన
– మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్
జోగి రమేష్ మీడియా సమావేశం చూస్తుంటే మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు అనిపిస్తోంది. జగన్ భజన చేయడం.. చంద్రబాబను తిట్టడం కోసమే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చాడు. విజ్ఞాపన చేయడానికి వస్తే దాడి చేసిన ఘటనలు కూడా విజువల్స్ తో సహా వున్నాయి. వీటికి జోగి రమేష్ సమాధానం చెప్పాలి. విజ్ఞాపన చేయడానికి ఒక్కరొస్తే సరిపోతుంది..కర్రలు, రాళ్లతో ఎందుకు వచ్చారు.? సంస్కారం గురించి జోగి రమేష్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వుంది. గాడిదకు ఏం తెలుసు గంధం వాసనన్నట్లు జోగికి ఏం తెలుసు చంద్రబాబుకు ఉన్న గంధం వాసన.?
జోగి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మీలాగా సూట్ కేస్ కంపెనీలు దోచుకునే లోకజ్ణానం లోకేష్ కు లేదు. పదో తరగతి పరీక్షా పత్రాలు ఎత్తుకెల్లే పరిజ్ఞానం లోకేష్ కు లేదు. లోకేష్ ఉన్న జ్ణానం..కార్యకర్తలను కాపాడటం..వారి సంక్షేమాన్ని, పార్టీ రాష్ట్రంలో ఎందుకు వుండాలన్న అంశంతోనే లోకేష్ ఉన్నారు. మీ ప్రకారం 16 నెలలు చిప్పకూడు తినే లోక జ్నానం లేదు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం చూస్తే జోగి రమేష్ దురుద్దేషం స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబును తిడితే తప్ప కేబినెట్ లోకి వెళ్లడానికి ఆయనకు మార్గం లేదు. దీనికి ఆదర్శం గుడివాడ ఎమ్మల్యే బూతుల నాని, కొబ్బరి చిప్పల మంత్రి. ఇతరులను హింసిస్తే జగన్ కు ఆనందం కలుగుతుంది. దాడి చేస్తే చూస్తూ కూర్చుంటామా.? ప్రతిఘటన ఖచ్చితంగా చేస్తాం. నువ్వు కొడితే మేము పడతామా.? మీరు ఒకటి కొడితే మేము రెండు కొడతాం.
ఏ దురుద్దేశంతో వచ్చి రాళ్లు వేశావ్.? ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని దాడి చేయడానికి వచ్చిన నీకు అది ప్రతిఘటనే. ప్రాణ రక్షణ కోసమే ప్రతిఘటన చేశారు. ప్రతి ఘటన శిక్షార్హంకాదు..నువ్వు చేసిన దాడి శిక్షార్హం. అసెంబ్లీలో డిల్లీ కోటలు బద్ధలు కొడతామని గొప్పలు చెప్పినోడివి..చంద్రబాబుపై దాడి చేయలేదంటే నమ్ముతామా.? నీ మాటలకు జగన్ చప్పట్లు కొట్టి అభినందించాడు. నీ కోరిక ప్రకారం మంత్రి పదవి కోరిక కూడా తీరబోతోంది. సన్నబియ్యం సన్నాసులను, కొబ్బరిచిప్పలు, అరగంట మంత్రులు ఇప్పటికే ఉన్నారు. డీజీపీ కార్యాలయంలోకి మీకు కార్పెట్ వేసి లోపలికి రమ్మన్నారు.
కానీ దళిత టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే రానివ్వలేదు. డీజీపీ కార్యాలయంలో వైసీపీ జెండా ఎగురవేస్తే ఎవరూ రారు. అది వైసీపీ కార్యాలయం అనుకుంటాం. డీజీపీ, పోలీసులు కలిసి వైసీపీ కార్యాలయంగా మార్చారు. ఎవరు ఏ విధంగా వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇంటికి అంతమంది ఎందకు వచ్చారు.? 20 కార్లలో మనుషులను వేసుకుని వచ్చి వినతి పత్రం ఇస్తావా.? నువ్వు చేసింది..దండయాత్ర..దాడి. రాళ్లు, కర్రలతో ఏం పని.? నీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దాంట్లో మీ పాలన చెత్తగా వుందని చెప్పారు.
బీసీలకు రావాల్సిన విదేశీ విద్య, ఆదరణ పథకాలు జగన్ రద్దు చేశారు. అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా దోచుకున్నదాని గురించి మాట్లాడు జోగి. దాడి చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన చేస్తాం. నువ్వు ఒకరాయి వేస్తే మేము వంద రాళ్లు వేస్తాం. జోగి రమేష్ సుద్దులు ఎవరికీ అవసరం లేదు. నీ చర్యలు ప్రజలు కళ్లతో చూస్తున్నారు. మంత్రి పదవి కోసం తప్ప నీ ఉద్దేశం ఏమీ లేదు. చంద్రబాబు అనుకుంటే మీరు బయట తిరిగేవారు కాదు. 3600 కి.మీ పాదయాత్ర చేశామని సాగదీసి చెప్తున్నారు. మేము దారి వదిలేయబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. నీ హేయమైన దాడిని ఖండిస్తున్నా. నీ చర్యలను బీసీలు ఎవరూ ప్రశంసించరు. సూట్ కేస్ కంపెనీలుతో జగన్ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు పాకింది నిజమే. దాని మీద ఎవరికీ అనుమానం లేదు. నీ సూట్ కేస్ కంపెనీలపై యూనివర్సీటీల్లో రీసెర్చ్ లు జరగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవంగా వుండండటం నేర్చుకోండి.

LEAVE A RESPONSE