పోలీస్ శాఖ పని తీరుపై బహిరంగ చర్చకు సిద్దమా?

-ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు?
– పోలీసులను అసభ్యకరంగా మాట్లాడితే అసోసియేషన్ ఎందుకు నోరు మెదపలేదు?
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ స్పందించి ఖండిస్తున్నామన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఎన్నో సందర్బాల్లో ఇంతకు మించి వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తే మీరెప్పుడు స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడారని తీవ్రంగా స్పందించారు. కనీసం ఇప్పటికైనా మీకో అసోసియేషన్ ఉందని గుర్తించి స్పందించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాని అంతకు ముందు ఎందుకు స్పందించలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
‘‘ఏందయా ఈ బొంగు పోలీసులు’’ అని గతంలో గురజాల వైసీపీ శాసనసభ్యులు కాసుమహేష్ రెడ్డి మాట్లాడితే మీకు తిట్టుగా అనిపించలేదా? ఎందుకు మీరు స్పందించలేదు? ‘‘కొజ్జా పోలీసుల’’ని చీరాలు వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ మోహన్ ఇష్టానుసారంగా బూతులు తిడితే మీకు తిట్టుగా అనిపించలేదా? ఎందుకు అసోసియేషన్ తరుపున స్పందించలేదు?
మెంటలా సీఐ.. నీకు రెండు నిమిషాల్లో లేపాస్తాను నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు. నా కాళ్లు పట్టుకొని పోస్టింగ్ లోకి వచ్చావని తాడికొండ వైసీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవీ ఇష్టానుసారంగా మాట్లాడితే మీరెందుకు స్పందించలేదు? నెల్లూరు వైసీపీ శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో, ఓ సర్కిల్ ఇన్సెపెక్టర్ ను చొక్కా పట్టుకొని బయటకు లాక్కొచ్చినప్పుడు మీరెందుకు స్పందించలేదు
. ‘‘నా ప్రోటో కాల్ తెలుసా నీకు? నీ ఎస్పీని, డీజీని పిలిచి నా ముందు నిలబెడతా’’? అని ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు? కోటం రెడ్డిని ఎన్నో సార్లు పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడారు కాని ఏనాడు మీరు స్పందించలేదు ఎందుకు? అధికారపార్టీ అని మీరు స్పందించలేదా? పోలీసులు కుక్కల్లా పని చేశారని వైసీపీ నేత కర్రి పాపారాయుడు.. దేశంలోనే అత్యున్నత ఖ్యాతి గడించిన ఏపీ పోలీస్ శాఖను, కుక్కలతో పోల్చినప్పుడు కూడా మీరు స్పందించలేదు. అధికారపార్టీ నాయకులు ఏమన్నా పర్వాలేదు. కాని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఏమీ అనకూడదని ఏమన్నా ఉందా? క్లారిఫికేషన్ ఇవ్వండి?
వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీస్ మీద దాడి చేయడానికి వెళ్లిన వైసీపీ నాయకులు పోలీసులపై మ్యాన్ హ్యాండలింగ్ చేస్తే, దెబ్బలు తిన్న పోలీసులు దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టకపోగా మమ్మల్ని కొట్టలేదని (సినిమా పోలీసుల్లా) అబద్దాలు చెప్పారు.
నువ్వు జిల్లా ఎస్పీవా? తెలుగుదేశం ఏజెంట్ వా? ఎన్ని రోజులు ఈ జిల్లాలో ఉంటావు? రెండు మూడ్రోజులే నీ బ్రతుకు ఇక్కడా అని నెల్లూరు జిల్లా ఎస్పీని వైసీపీ శాసనసభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? ఆయన కూడా ఐపీఎస్ అధికారేగా అయినా ఎందుకు స్పందించలేదు?
గుంటూరు జిల్లా ఆత్మకూరులో దళితులను వైసీపీ నాయకులు ఆ గ్రామం నుంచి తరిమికొడితే నేనున్నాని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి బయటకు రానివ్వలేదు. అంతే కాకుండా ఆయన గేట్లకు పెద్ద పెద్ద తాళ్లు తెచ్చి గేటుకు కట్టారు. ఇది ఏ రాజ్యాంగంలో ఉంది. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు. అప్పుడెందుకు స్పందించలేదు? చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి లాంటి వాడు కాదు కదా. నేరస్థుడు కాదు కదా, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే వారు కాదు కదా, 16 నెలల పాటు జైల్లో ఉన్నవారు కాదు కదా? అయినా ఎందుకు తాళ్లతో కట్టారని అసోసియేషన్ తరుపున ఎందుకు అడగలేదు?
విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు అనుమతి తీసుకొని వెళితే, విశాఖ విమానశ్రయంలోనే వైసీపీ గూండాలు ఆపితే మీ పోలీసులు చంద్రబాబు నాయుడును వెనక్కి వెళ్లిపొమ్మని అన్నారు. అలా ఎందుకు చేశారని అసోసియేషన్ తరుపున అప్పుడెందుకు స్పందించలేదు? డీజీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి మీ అసోసియేషన్ ఓకే చెబుతుందా? నాడు విశాఖ విమానశ్రయంలోనే చంద్రబాబు నాయుడును అడ్డుకోవడం తప్పా కాదా? దానిని మీరు సమర్ధిస్తారా? నాడు మీరెందుకు స్పందించలేదు? వైసీపీ గూండాలను తరిమికొట్టి చంద్రబాబుకు మార్గం సుగమం ఎందుకు చేయలేదు?
రామతీర్ధంలో శ్రీరాముడి శిరచ్చేధం చేస్తే చూడటానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుని ఎన్ని ఇబ్బందులు పెట్టారు? అది మీకు తప్పుగా అనిపించలేదా? అందుకే స్పందించలేదా? లారీలు, బస్సులు, పోలీస్ జీబులతో ఆయన కాన్వాయి ని అడ్డుకున్నారు. రాజ్యంగం హక్కులు అమలు కావా? డీజీ వలన మీ అసోసియేషన్ కు చెడ్డ పేరు వస్తుందని ఎందుకు మీరు చెప్పలేదు? తిరుపతి విమానశ్రయంలో చంద్రబాబు నాయుడును నేల మీద కూర్చోబెట్టారు. అలా చేస్తే పోలీస్ శాఖ కు చెడ్డ పేరు వస్తుందని అసోసియేషన్ తరపున ఎందుకు చెప్పలేదు. నిరసన తెలియజేసే హక్కు లేదా? చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద పోలీస్ చేతులో లాఠీ లాక్కొని విసిరారు, చెప్పులు, కర్రలు విసిరితే ఆర్టికల్ 19 కింద ప్రజా స్వేచ్ఛని డీజీ ప్రజలందరికి జ్ఞానోదయం కలిగించారు. మీరెందుకు ఆయనను ప్రశ్నించలేదు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అసోసియేషన్ కు ఉంది.
లోకేష్ పర్యటనలు ఎందుకు ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు. పోలీసు శాఖ అసమర్ధలో మీరు బాగస్థులు కాదా? దళితుడైన విక్రమ్ ను హైదరాబాద్ నుండి పోలీసులు పిలిపించడం వలన ఆయన చనిపోయాడని కారకుయ్యారు. అప్పుడు మీరు ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. ఆ సీఐ, ఎస్సైను ప్రశ్నించలేకపోయారు. పోలీస్ స్టేషన్ లో ఇసుక మాఫియా ఆగడాన్ని ప్రశ్నించిన ఒక దళితుడును శిరోముండనం చేసిన ఎస్సైని బలిపశువును చేస్తే కొత్తగా డ్యూటీలో చేరిన ఎస్సైకి శిరోముండనం అంటే తెలియదని ఎందుకు మీరు స్పందించలేదు. అసలు నేరస్థులను ఎందుకు వదిలిపెట్టారు.
శాండ్ కింగ్ కమల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయలేదెందుకని ప్రశ్నించలేదు? పోలీసులు దళిత రైతులకు బేడీలు వేస్తే మీరు సమర్ధిస్తారా? దళిత రైతులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అమలు అవుతాయా? ఎన్నో అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు మాట్లాడలేదు. దళిత విద్యార్ధి రమ్య హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరిమర్శించడానికి వెళ్లిన లోకేష్ ను ఎన్నో పోలీస్ స్టేషన్లను తిప్పి ఇబ్బందులకు గురి చేశారు. మేము అధికారపార్టీ తొత్తులమని చాలా మంది పోలీసులు బహిరంగంగా చెబుతున్నారు. కొంత మంది పోలీసులు పోలీస్ స్టేషన్ లో కొడుతున్న సీన్ ను అధికారపార్టీ నాయకులకు చూపిస్తున్నారు.
రెండున్నరేళ్లుగా పోలీస్ శాఖ రోజు రోజుకు తీసికట్టుగానే వ్యవహరిస్తోంది. ఏపీ పోలీస్ శాఖ వ్యవహరించే తీరు ప్రశ్నార్ధకంగా మారుతుంది తప్ప ప్రసంశనీయంగా ఉందా? సవాంగ్ నాయకత్వంలో పని చేస్తున్న పోలీస్ శాఖ భ్రహ్మండంగా పని చేస్తుందని ఓపెన్ డిబేట్ పెట్టండి. మీరు రైట్ అని చెబితే మీకు క్షమాపణ చెబుతాను. కాదని చెబితే డీజీని పోస్ట్ ను తప్పించి ప్రజలకు క్షమాపణ చెప్పిస్తారా? ఒక ప్రకటన చేయమని అడుతున్నా? మేము రైటా? సవాంగ్ రైటా? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖలో దొంగ కేసులు, అన్యాయాలు, అక్రమాలు, చట్ట వ్యతిరేక చర్యలు, తప్పుడు కేసుల బనాయించి మీ దృష్టికి రాలేదా బహిరంగ చర్చకు రండి.
తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ వెయ్యడానికి వెళుతుంటే పోలీసులు మందు సీసాలు తీసుకువెళ్లి ఆయన ఇంట్లో పెట్టడం సీసీ ఫోటేజ్ లో రావడం అందరం చూశాం. డీజీ సవాంగ్ కు ఎంత ఖర్మ పట్టిందో అని ప్రశ్నిస్తున్నాం. డీజీ ఎన్నో సార్లు కోర్టులో దోషిగా నిలబడ్డారు. 151 సీఆర్పీసీ ఎంటో చదవి వినిపించారంటే మరొకరు అయితే డీజీ గా రాజీనామాలు చేసే వెళ్లేవారు. అదే మీరైతే రిజైన్ చేసేవారు. ఇంత అరాచకం జరుగుతుంటే, పోలీసులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్న సెషల్ మీడియాలో జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని అంటే ఎందుకు ఆయనను కట్టడి చేయలేదు. ఆయన అంత దౌర్జన్యం సృష్టిస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. నిజమైన పోలీసులుగా యాక్ట్ చేయలేదు ఓ డ్రామా, సినిమా పోలీసులా యాక్ట్ చేశారు.
నక్క బోయిన తరువాత బొక్క కొట్టినట్లుగా అంతా అయిన తరువాత అప్పుడు పోలీసులు వచ్చి టీడీపీ నాయకులపై లాఠీ చార్జ్ చేశారు. అసలు ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి? ఎవరింటి మీదకు ఎవరు వచ్చారు? టీడీపీ నాయకులను ఇష్టానుసారంగా కొట్టారు. సీఐ, ఎస్సైలకు అక్కడ డ్యూటీ చేసే అర్హత ఉందా? చంద్రబాబు నాయుడును చంపడానికి వచ్చిన వారీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు. కర్నూలులో మైనార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ నాయకుడు శిబ్లీపై హత్యయత్నం కేసు బనాయించారు. ఇక్కడ కర్రలు తీసుకొని ఇంటి మీదకు వచ్చిన వారి మీద మమూలు కేసు పెడతారా? మీ అసోసియేషన్ ఎందుకు మాట్లాడలేదు. డీజీ వ్యవహరించే విధానంపై మీరెందుకు ప్రశ్నించరు. పోలీస్ అసమర్ధత చెప్పాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చినప్పుడు తప్పు చేసిన వారెవ్వరైనా సరే చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది.

Leave a Reply