Home » ఈ ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిది?

ఈ ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిది?

– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

కడప జిల్లా, ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాను. పేదల ఇళ్లను నిర్మించి ఇవ్వడం చేతకాని ఈ ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిది? మా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను 5 ఏళ్లు అయినా వసతులు కల్పించి లబ్దిదారులకు ఇవ్వలేకపోయారు. అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడినా…మీ కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? ఇళ్లను, వ్యవస్థలను, రాష్ట్ర ప్రతిష్టను కూల్చిన మీ ప్రభుత్వాన్ని మే 13వ తేదీన ప్రజలు కూల్చబోతున్నారు.

Leave a Reply