Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్‌ రెడ్డిపై వై.ఎస్‌.షర్మిల ఫైర్‌

-ఎంతటి త్యాగమూర్తివయ్యా?
-హత్య చేయకపోతే సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావ్‌?

-కాల్‌ రికార్డ్స్‌ ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి?

న్యాయ యాత్రలో భాగంగా పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిపై సూటిగా ప్రశ్నలు సంధించారు. మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? హత్యపై మీ కాల్‌ రికార్డ్స్‌ ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..మేము బురద జల్లుతున్నాం అంట.. మా విజ్ఞతకు వదిలేస్తాడట.

దొంగలు ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్లు ఉంది ఆయన తీరు.. ఇన్ని మాటలు చెప్పే బదులు కేసులో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా..గూగుల్‌ మ్యాప్స్‌కి మీకు సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా? మీ కాల్‌ రికార్డ్స్‌ హంతకుల ఫోన్‌ రికార్డ్స్‌తో ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి? హంతకులకు మీకు సంబంధాలు ఎందుకు ఉన్నాయి? సీబీఐ విచారణ ఎందుకు వద్దు అన్నారో చెప్పండి? విచారణ అంటే ఎందుకు భయపడ్డారు? ఇళ్లంతా రక్తం ఉంటే హార్ట్‌ ఏటాక్‌తో చనిపోయారు అని ఎందుకు అబద్ధం ఆడారో చెప్పండి? త్యాగమూర్తి లెక్క మీ మాటలు చూస్తుంటే దొంగలు దొంగలు బుజాలు తరుముకున్నట్లు ఉంది..ఇలాంటి వాళ్లు ఇప్పుడు మన నాయకులని మండిపడ్డారు.

అవినాష్‌ రెడ్డి కోసం నేను ఒప్పుకున్నా..
వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే వద్దు అని చెప్పిన దాన్ని నేను. నేను ఎంపీ సీట్‌ కావాలి అనుకుంటే నాకు ఆ రోజే వచ్చేది కాదా? అవినాష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచింది నేను. జగన్‌ కోసం 3200 కి.మీ పాద యాత్ర చేశా. ఒక్కరోజు కూడా పదవి కావాలని అడగలేదు. ఇవ్వాళ ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కనిక రం లేకుండా మాట్లాడుతున్నారు. సునీతను, నన్ను అవమానిస్తున్నారు. నేను వైఎస్‌ షర్మిలా రెడ్డి కాదట.. నేను వైఎస్‌కే పుట్టలేదట..ఎన్ని మాట్లాడినా నేను భరించా.. అహంకారంతో మదమెక్కిన మాట్లాడుతున్నారు.

వైఎస్‌ వివేకా నాకు చిన్నాన్న.. నన్ను ఎత్తుకొని పెంచిన వాడు.. ఆనాడు ముందు చూపుతోనే నన్ను కడప ఎంపీగా పోటీ చేయాలని అడిగాడు.. నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు..అప్పుడు నాకు అర్థం కాలేదు.. వివేకా మాట విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు దాటింది. ఈనాటి కీ హంతకులకు శిక్ష పడలేదు. చివరికి వివేకా బిడ్డ చంపింది అని ముద్ర వేశారు.. న్యాయం కోసం సునీత ఎక్కని గడప లేదు..తిరగని కోర్టులు లేవు. ఒక పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు. సొంత చిన్నాన్న చనిపోతే సహాయం కూడా లేదు. ఇది అన్యాయం, అధర్మమని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE