Suryaa.co.in

Andhra Pradesh

పట్టపగలు తప్పతాగి బాబు ఇంటిపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు?

-నిన్న మేం అక్కడ ఉంటే జోగి రమేష్ ని బట్టలూడదీసి కరకట్ట నుంచి పెడన వరకు తరిమి కొట్టేవాళ్లం
– ఇలాంటి సన్నాసులెవరైనా ఇంకోసారి చంద్రబాబు ఇంటి పరిసరాల్లో కన్పిస్తే అక్కడే పాతేస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పతాగి పట్టపగలు మద్యం మత్తులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి పాల్పడితే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. శనివారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జోగి రమేష్ మంత్రి పదవి కోసం వీధి రౌడీ కంటే హీనంగా వ్యవరిస్తున్నారు. తాగిన మత్తులో జోగి రమేష్ అతని అనుచరులు, మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి వెళ్తుంటే పోలీసులు మద్దతు తెలిపారు. నిన్న జరిగిన ఘటనతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన అయ్యన్నని అసభ్య పదజాలం వాడారంటున్నారు. కానీ వైసీపీ మంత్రులు కొడాలి నాని సహా వైసీపీ ఎమ్యేల్యేలు ఏ భాష వాడుతున్నారో ప్రజలకు తెలియదా?
జోగి రమేష్ నిన్న తాగిన మత్తు దిగిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి..అవసరమై మళ్లీ చంద్రబాబు పై ఇంటిపైకి వెళ్తానంటున్నారు. జోగి రమేష్ సహా మిగతా సన్నాసులు ఎవరైనా సరే..ఇంకో సారి చంద్రబాబు ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కనిపిస్తే…గొయ్యి తీసి పాతిపెడతాం. రోజుకు పుల్ బాటిల్ తాగి ఇసుక, మట్టి అమ్ముకునే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లేంత మగాడివా? నీ బ్రతుకుంటే విజయవాడ ప్రజలకు తెలీదా? నిన్న జరగిన ఘటనపై మాకు సరైన సమాచారం లేదు లేకపోతే నిన్ను అక్కడే పాతేసేవాళ్లం. జో గి రమేష్ నువ్వు ఒక వీధి రౌడీవి నువ్వు.. అధికారం, పోలీసుల అండ చూసుకుని విర్రవీగుతున్నారు. రేపు అనే రోజు ఒకటి ఉంది..ఆరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చాక నీ నియోజకర్గ ప్రజలే నిన్ను వీది కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు ఇబ్రహీంపట్నంలో చేస్తున్న కబ్జాలు, దందాలు ప్రజలకు తెలీదనుకుంటున్నావా?
నీకు నీ ముఖ్యమంత్రి మద్దతు అదికార బలం మరో రెండు సంవత్సారాలే. మీ అదిష్టానం కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకో… వైసీపీ పాలనలో వీధి రౌడీలకే మంత్రి పదవులు ఇస్తున్నారు, పోలీసులు సెల్యూట్ చేస్తున్నారంటే రాష్ర్ట్టంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటొ అర్ధమవుతోంది. వైసీపీ అరాచక పాలపలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకుల్ని ముందస్తు అరెస్టు చేసే పోలీసులు.. నిన్న వీధి రౌడీ జోగి రమేష్ ని చంద్రబాబు ఇంటికి ఏవిధంగా పంపారు? దీనికి డీజీపీ, డీఐజీ, గుంటూరు ఎస్పీ సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టే పోలీసులు.. వందల మంది రౌడీషీటర్లను వెంటేసుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లటం పోలీసులకు కనపడటం లేదా? ఇది పోలీసుల వైఫల్యం కాదా? జోగి రమేష్ తప్ప తాగి తన అనుచరులతో చంద్రబాబు ఇంటి దగ్గర రచ్చ చేస్తే… పోలీసులు సెల్కూట్ కొట్టి డీజీపీ ఆపీస్ లోకి తీసుకెళ్లారు. డీజీపీ ఆపీస్ లో తాగిన మత్తులో కింద పడబోతుంటే జోగి రమేష్ ని పక్కన ఉన్న గన్ మెన్ పట్టుకున్నారు. జోగి రమేష్ ను సెల్లూటి కొట్టి లోపలికి తీసుకెళ్లిన పోలీసులు టీడీపీ నేతల్ని డీజీపీ కార్యాయలం బయటే ఆపేశారు.
చంద్రబాబు పాలనలో పోలీసులు అవార్డులు వస్తే.. వైసీపీ పాలనలో పదవుల కోసం పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారు. దీనిపై పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాలిబన్ల పాలన కంటే ఘోరంగా ఏపీలో పాలన సాగుతోంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయంటే రాష్టంాచలో చట్టం అమలవుతుందా?
జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి మళ్లీ వెళ్తానంటున్నారు. దమ్ముంటే రావాలి..పోలీసులు, నీ రౌడీలను అందర్నీ తీసుకుని రా తిరిగి ఎలా వెళ్తావో చూస్తాం. నిన్న మేం అక్కడ ఉంటే అక్కడ ఉంటే..నీ మత్తు దిగి వరకే కరకట్ట నుంచి నీ నియోజకర్గం వరకు బట్టలూడదీసి కొట్టే వాళ్లం.
కృష్ణా నదిలో దొరికే ఇసుక ను అమ్ముకుకే బ్రతికే జోగి రమేష్ మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి వీధిరౌడీలకు వైసీపీ మంత్రి పదవులు ఇస్తున్నారు,, పోలీసులు సెల్యూట్ చేస్తున్నారంటే ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది. వైసీపీ నేతలు మా సహనాన్ని పరీక్షొంచొద్దు… మేం సహనం తప్పితే ఎవరినీ ఉపేక్షేంచిది లేదు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటినికాదు చంద్రబాబు కాలి గోటిని కూడా తాకలేడు. అయ్యన్న ప్రజల అభిప్రాయాలే చెప్పారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోకుంటే పోలీసులకు న్యాయపరంగా చిక్కులు తప్పవని బోండా ఉమమహేశ్వరావు అన్నారు.

LEAVE A RESPONSE