Suryaa.co.in

Andhra Pradesh

మేధో సంపత్తి హక్కులను దక్కించుకున్న ఆచార్య రామినేని

ఐఓటి అధారంగా ఉద్యోగి సామర్ధ్యం లెక్కించేలా స్మార్ట్ మానిటరింగ్ పరికరం రూపకల్పన
సంస్ధ ఉత్పాదకతను పెంపొందించి ప్రభావవంతమైన సమాజ రూపకల్పనకు తోడ్పాటు

ఆచార్య నారార్జున విశ్వవిద్యాలయం కామర్స్ , బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రోఫెసర్ డాక్టర్ రామినేని శివరామ్ ప్రసాద్ మరో నూతన ఉత్పత్తిపై మేధో సంపత్తి హక్కులను దక్కించుకున్నారు. ఇప్పటికే వినూత్న అంశాలపై నాలుగు పేటెంట్లు పొందిన అచార్య రామినేనికి ఇది ఐదవది. ఇంటర్కెట్ ఆప్ ధింక్స్ ను ఉపయోగించి ఉద్యోగి సామర్థ్యం, ఉత్పాదకతను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో ఈ స్మార్ట్ మానిటరింగ్ పరికరాన్ని రూపొందించారు.

పేటెంట్లు, డిజైన్ల చట్టం, 2000 నిబంధనలను అనుసరించి దీనికి భారత ప్రభుత్వ మేధో సంపత్తి హక్కుల పేటెంట్ కార్యాలయం పేటెంట్ ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అచార్య రామినేని మాట్లాడుతూ ప్రత్యేకించి రిమౌట్ ఏరియాలో పనిచేసే ఉద్యోగికి సంబంధించిన ఉత్పాదకను ఎప్పటి కప్పుడు లెక్కించేందుకు ఈ స్మార్ట్ డివైజ్ ఉపయోగ పడుతుందన్నారు. ఉద్యోగికి సంబంధించిన డేటా, చేయవలసిన ఉత్పాదకతలకు సంబంధించిన అంశాలను ఐఓటి విధానంలో ముందుగానే కంప్యూటర్ సిస్టమ్స్ కు అనుసంధానం చేయటం ద్వారా గణనీయమైన ఫలితాలను రాబట్టవచ్చన్నారు.

అయా సంస్ధల సిఇఓలు జిపిఎస్ విధానాన్ని రిమోట్ ఏరియాలో పనిచేసే ఉద్యోగికి అనుసంధానించటం ద్వారా ఎప్పటి కప్పుడు పూర్తి సమాచారాన్ని పొందగలుగుతారన్నారు. ఈ క్రమంలో ప్రతిచోటా తెలివైన ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం కల్పించి కార్మికుల ఉత్పాదకతను పెంపొందించమే కాక, సమాజాన్ని మరింత ప్రభావవంతంగా మార్చగలుగుతామని అచార్య రామినేని శివరామ ప్రసాద్ తెలిపారు.

LEAVE A RESPONSE