Suryaa.co.in

Uncategorized

పురంధేశ్వరి దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు

తండ్రికి తిండి పెట్టని ఘనత ఆమెది
స్వార్ధ ప్రయోజనాలకోసమే ఆమె తాపత్రయం
ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్,7: డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి తీరున తప్పుబట్టారు.మానవ వనరుల శాఖ, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా ఆమె చేయలేదన్నారు. ఫలానా స్కీం తెచ్చారు, ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయించారు అని చెప్పుకోలేని పరిస్థితి ఆమెదని, ఆమె దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే పెట్టారని అన్నారు..

పురందేశ్వరీ….ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా అని ప్రశ్నించారు. వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి…పాపం 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని దుయ్యబట్టారు. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా ! అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు..

పురందేశ్వరి ఎప్పుడూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తారని అన్నారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే, మీ అంతిమ లక్ష్యం కుల “ఉద్దరణే”. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవని మండిపడ్డారు.

పురంధేశ్వరి స్వార్థంతో కూడిన అవకాశవాదం ఎలా ఉంటుందంటే ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి మళ్లీ బరిలోకి దిగరని చెప్పారు. ప్రజల మనోభావాలను పట్టించుకోరని, కాబట్టి రెండోసారి గెలిచే సీన్ లేదన్నారు. కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ హవాలో బయటపడ్డారని, బిజెపిలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి లక్షా 75 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

LEAVE A RESPONSE